NTV Telugu Site icon

Ramayan : రావణుడు ఆన్ డ్యూటీ

Yash Ramayana

Yash Ramayana

Ramayan : బాలీవుడ్ డైరెక్టర్ నితిష్ తివారీ పురాతన ఇతిహాసం `రామాయ‌ణం` ఆధారంగా `రామాయ‌ణ్` అనే సినిమాను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ‌బీర్ క‌పూర్.. సీత పాత్రలో సాయి పల్లవి.. రావణుడి పాత్రలో కన్నడ హీరో యష్.. హనుమంతుడి పాత్రలో సన్నిడియోల్ లాంటి సార్లు నటిస్తున్నారు. భారీ తారాగణంతో అత్యంత హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందుతున్న సినిమా షూటింగ్ ఇప్పటికే ప్ర‌ధాన పాత్ర‌ల‌పై కొనసాగుతుంది. అయితే రావ‌ణుడు మాత్రం ఇంకా సెట్స్ లో అడుగు పెట్టలేదు. ఇక ఆ సమయం రానే వచ్చినట్లు తెలుస్తోంది. రావ‌ణుడి పాత్రకు సంబంధించి షూటింగ్ ముంబైలో ప్రారంభమైన‌ట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా రావ‌ణుడిపై స‌న్నివేశాల‌కు ప్రత్యేకమైన గ్రీన్ మ్యాట్ సిద్దం చేశారు. ఆ గ్రీన్ మ్యాట్ పై రాముడు-రావ‌ణుడి మ‌ధ్య యుద్ద స‌న్నివేశాలు తీయనున్నారు. అయితే ఇందులో కేవ‌లం రావ‌ణుడి పై మాత్రమే యుద్ద స‌న్నివేశాలు చిత్రీకరిస్తారట.

Read Also:IND vs PAK: ఓడీఐలో అత్యధిక క్యాచ్‌లు.. విరాట్‌ కోహ్లీపై సరికొత్త రికార్డు…

రాముడు ర‌ణ‌బీర్ క‌పూర్ త్వరలోనే షూట్ లో జాయిన్ అవుతున్నట్లు తెలుస్తోంది. రామ‌రావ‌ణ యుద్దం అంటే బాణం వార్. ఇరువురు బాణాలు సంధించుకుని యుద్దానికి తెర లేపుతారు. ఈ నేప‌థ్యంలో య‌ష్ పై మాత్రమే సోలోగా ఈ సీన్లు ముందుగా షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. యష్ వెర్షన్ పూర్తయిన తర్వాత రణబీర్ వెర్షన్ పూర్తవుతుందని తెలుస్తోంది. ఈ వార్ సీన్ల చిత్రీక‌ర‌ణకు కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నారట‌. గ్రీన్ మ్యాట్ సెట్ అంతా చాలా నేచుర‌ల్ గా ఉంటుంద‌ని స‌మాచారం. ఈ స‌న్నివేశాల‌కు సంబంధించి సీజీ వ‌ర్క్ కూడా ఎక్కువ‌గా ఉంటుంద‌ని సాంకేతిక విభాగం చెబుతుంది. దీనికి సంబంధించిన ప‌నులు హాంగ్ కాంగ్ స్టూడియోలో జ‌రుగుతున్నట్ల సమాచారం.

Read Also:Jio Bharat K1 Karbonn 4G: క్రేజీ డీల్.. రూ. 699కే జియో 4G ఫోన్