Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Ramagundam Coal Mine Project Singareni Approval

Singareni : సింగరేణి చరిత్రలో మైలురాయి.. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.!

Published Date :May 3, 2026 , 3:26 pm
By Gogikar Sai Krishna
  • ₹2,194 కోట్ల మెగా ప్రాజెక్టుకు కేంద్ర గ్రీన్ సిగ్నల్
  • ఏడాదికి 210 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం
  • 5,500 మందికి ఉపాధి భరోసా.. రీజియన్‌కు 25 ఏళ్ల జీవితం
  • పర్యావరణహిత టెక్నాలజీతో మైనింగ్.. ఎన్టీపీసీకి ఇంధన బలం
Singareni : సింగరేణి చరిత్రలో మైలురాయి.. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Singareni : సింగరేణి కాలరీస్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రామగుండం (ఆర్‌జీ) కోల్ మైన్ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ నుండి ప్రాథమిక అనుమతులు లభించాయి. సుమారు ₹2,194.05 కోట్ల భారీ అంచనా వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్టు, సింగరేణి చరిత్రలోనే ఒక విప్లవాత్మక అడుగుగా నిలవనుంది. మొత్తం 4326 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ మెగా ప్రాజెక్టు ద్వారా దాదాపు 314.98 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను వెలికి తీయడమే ప్రధాన లక్ష్యంగా సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఈ ప్రాజెక్టు సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా ఏడాదికి 210 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, రెండు ఓపెన్ కాస్ట్ గనులు , మూడు భూగర్భ గనులను కలిపి ఒకే విశిష్ట ప్రాజెక్టుగా దీనిని రూపొందించారు. ఇందులో భాగంగా ఓపెన్ కాస్ట్ ప్రాంతం నుంచి 182.28 మిలియన్ టన్నులు, భూగర్భ ప్రాంతం నుంచి 132.70 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయనున్నారు. గతంలో మూతపడిన జీడీకే-10 , వకీల్‌పల్లి గనులను ఇప్పుడు ఓపెన్ కాస్ట్‌గా మార్చి బొగ్గు తవ్వకాలు జరపడం ద్వారా పాత గనులకు కొత్త జీవం పోస్తున్నారు.

Also Read

  • Karimnagar: రెచ్చిపోయిన దొంగలు.. పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు.. భారీగా బంగారం, ఆభరణాలు దోపిడీ
  • Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. 'ఎక్స్‌ప్లోర్ టు ఎక్స్‌పాండ్' వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
  • Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి 'బంపర్ గిఫ్ట్'.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!
  • Abhishek Sharma: హనుమాన్ ఆలయంలో కాటేరమ్మ కొడుకు.. రేపు దబిడిదిబిడే..

ఈ సరికొత్త ప్రాజెక్టు వల్ల రామగుండం రీజియన్‌కు మరో 25 ఏళ్ల సుదీర్ఘ జీవితకాలం లభించనుంది. పాత గనులు క్రమంగా మూతపడుతున్న తరుణంలో, అక్కడ పనిచేస్తున్న సుమారు 5,500 మంది ఉద్యోగులకు , కార్మికులకు ఈ ప్రాజెక్టు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. దీనివల్ల కార్మికుల భవిష్యత్తుకు భరోసా లభించడమే కాకుండా, స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం కానుంది. తక్కువ పెట్టుబడులతోనే గరిష్ట స్థాయిలో బొగ్గు ఉత్పత్తి చేసేలా సింగరేణి యాజమాన్యం పకడ్బందీ ప్రణాళికలను అమలు చేస్తోంది.

పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ ప్రాజెక్టులో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. తవ్వకాల ప్రక్రియలో భాగంగా వచ్చే ఓవర్‌బర్డెన్ మట్టిని బయట పారబోయకుండా, తిరిగి ఖాళీ క్వారీల్లోనే నింపే పర్యావరణహిత విధానాన్ని (Backfilling) ఇక్కడ అనుసరించనున్నారు. ఇందుకోసం షావెల్-డంపర్, లాంగ్‌వాల్ , కంటిన్యూయస్ మైనర్ వంటి అధునాతన టెక్నాలజీలను వాడుతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా లభించే బొగ్గు ఎన్టీపీసీ రామగుండం వంటి భారీ విద్యుత్ కేంద్రాలకు , ఇతర బొగ్గు ఆధారిత పరిశ్రమలకు నిరంతర ఇంధన సరఫరాను అందిస్తుంది. తద్వారా సింగరేణి-ఎన్టీపీసీ మధ్య ఉన్న దశాబ్దాల నాటి వ్యాపార బంధం ఈ ఆర్‌జీ కోల్ మైన్ ప్రాజెక్టుతో మరింత బలోపేతం కానుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Coal Production
  • NTPC
  • Ramagundam coal mine
  • Singareni
  • Telangana Industry

తాజావార్తలు

  • Singareni : సింగరేణి చరిత్రలో మైలురాయి.. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.!

  • West Bengal Elections: మమతా బెనర్జీ నియోజకవర్గంలో మరో గందరగోళం..

  • Babar Azam: కోహ్లీకి బాబర్ ఆజం షాక్.. సొంత దేశం అభిమానులే ఏకిపారేస్తున్నారు!

  • Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని ఎలా అవుట్ చేయాలి.. చాట్ జీపీటీ సమాధానం మైండ్ బ్లోయింగ్..

  • Realme GT 2: 5,000mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరా.. రియల్‌మీ స్మార్ట్‌ఫోన్‌ ను రూ. 15,000 తక్కువకే కొనండి!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions