Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ నుంచి క్రేజీ అప్డేట్.. వారం రోజులు పాటు..!

Ram Charan Game Changer

Ram Charan Game Changer

Ram Charan’s Game Changer Movie Update: రామ్ చరణ్‌ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’. దిల్‌ రాజు నిర్మిస్తున్న 50వ సినిమా కావడంతో బడ్జెట్‌ విషయంలో ఆయన ఎక్కడా రాజీపడడం లేదు. పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో చరణ్‌ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న గేమ్‌ ఛేంజర్‌ అప్‌డేట్స్‌ కోసం చరణ్‌ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్‌కు ఓ క్రేజీ అప్డేట్.

గేమ్‌ ఛేంజర్‌ చివరి షూటింగ్ షెడ్యూల్ నేడు ప్రారంభమైంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వారం రోజుల పాటు షూటింగ్ ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్‌లో రామ్‌ చరణ్‌తో పాటు ఎస్‌జే సూర్య, నవీన్ చంద్ర కూడా పాల్గొంటారు. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది. గేమ్ ఛేంజర్ చిత్రంను దీపావళికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇందులో చరణ్‌ సరసన కియారా అడ్వాణీ నటిస్తున్నారు. శ్రీకాంత్‌, అంజలి, ఎస్‌జే సూర్య, నవీన్ చంద్ర, సునీల్‌ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

×
×
Ad

Also Read: Suriya-Jyothika: 18 ఏళ్ల తర్వాత.. ఆఫ్‌స్క్రీన్‌, ఆన్‌స్క్రీన్‌ హిట్‌ జోడీ!

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ఇటీవలే విడుదలైన ‘జరగండి జరగండి’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు గేమ్‌ ఛేంజర్‌ నుంచి మరో క్రేజీ సాంగ్ రానుందని తెలుస్తోంది.