NTV Telugu Site icon

Upasana : మెగా అభిమానులకు పండగే..ఫోటో కాదు ఏకంగా క్లింకార వీడియోనే వచ్చేసింది

New Project (45)

New Project (45)

Upasana : టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్, ఉపాసన పెళ్లి అయిన పదేళ్ల తర్వాత గతేడాది తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. 2023 జూన్ 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత మెగా వారసురాలికి క్లీంకార అని నామకరణం చేయగా.. దాని వెనుక ఉన్న చరిత్ర తెలిసి అంతా షాకయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, ఒడిశా ప్రాంతాల్లో నివ‌సిస్తున్న చెంచు జాతి నుంచి స్పూర్తి పొంది క్లీంకార‌గా నామ‌క‌ర‌ణం చేశామంటూ మెగా కోడలు ఉపాసన కొద్ది రోజల క్రితం తెలిపారు. తల్లిదండ్రులు సాధించిన ఘనతను పిల్లలకు ట్యాగ్ చేయకూడదని, ఎవరి ఘనత వారే సాధించుకోవాలని కూడా ఉపాసన ఆ సమయంలో చెప్పుకొచ్చారు.

Read Also:Arvind Kejriwal: ఢిల్లీలో ఆప్ అధికారంలోకి రాగానే మంచి నీటి బిల్లులను మాఫీ చేస్తాం..

Read Also:Gudivada Amarnath: మంత్రి లోకేష్ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు

ప్రస్తుతం క్లీంకార వయసు 15 నెలలు అయినా.. ఆమె ఫేస్ ను ఇంకా మెగా ఫ్యామిలీ బయటకు రివీల్ చేయలేదు. మెగా ఫ్యామిలీ మెంబర్స్ పలు సందర్భాల్లో ఫోటోలను షేర్ చేసినా ఫేస్ ను మాత్రం కనిపించకుండా బ్లర్ చేస్తున్నారు. ఆ మధ్య తిరుమల వెళ్లినప్పుడు క్లీంకార ముఖం అనుకోకుండా కెమెరాలకు చిక్కినా.. అఫీషియల్ గా మాత్రం ఇంకా బయటకు రివీల్ చేయలేదు. తాజాగా క్లింకారకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు ఉపాసన. వారి గారాల పట్టి క్లింకార తన తండ్రి రామ్‌చరణ్‌ను ఫస్ట్ టైమ్ టీవీలో చూసి మురిసిపోతుంది. ఈ వీడియోను స్వయంగా ఉపాసన తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Show comments