Site icon NTV Telugu

Charan – Vanga: చరణ్ – సందీప్ వంగా.. అరాచకం లోడింగ్

Ram Charan

Ram Charan

Charan – Vanga: ప్రస్తుతానికి రామ్ చరణ్ తేజ్ బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇక ఆ తర్వాత ఏ సినిమా చేస్తాడు అనే విషయం మీద ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అయితే, తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు, ఈ మధ్యకాలంలో సందీప్ రెడ్డి వంగా, రామ్ చరణ్ తేజ్ ఇద్దరూ కలిసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, సందీప్ రెడ్డి వంగా రామ్ చరణ్‌కి ఒక ఆసక్తికరమైన లైన్ చెప్పగా, దానికి వెంటనే రామ్ చరణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

READ ALSO: Maa Inti Bangaram : మా ఇంటి బంగారం కూడా అలాంటిదే

ప్రస్తుతానికి ఆ లైన్ డెవలప్ చేయమని చెప్పినట్లుగా చెబుతున్నారు. ఒకవేళ లైన్ డెవలప్ చేసి, పూర్తిస్థాయి స్క్రిప్ట్ అయ్యాక రామ్ చరణ్‌కి నచ్చితే, కచ్చితంగా సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. అదే జరిగితే, పాన్ ఇండియా లెవెల్లో మరొక బ్లాస్టింగ్ హిట్ లోడింగ్ అనే చెప్పాలి. ప్రస్తుతానికి సందీప్ రెడ్డి వంగా కూడా ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇంకా షూటింగ్ మొదలుపెట్టలేదు కానీ, ప్రస్తుతానికి ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయినా కూడా, ఇప్పట్లో అయితే పట్టాలు ఎక్కడం కష్టమనే చెప్పాలి.

READ ALSO: Maa Inti Bangaram : మా ఇంటి బంగారం కూడా అలాంటిదే

Exit mobile version