గ్లోబల్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చెంజర్ సినిమాలో నటిస్తున్నారు .. ఆ సినిమా చివరిదశ షెడ్యూల్ ను పూర్తి చేసే పనిలో ఉంది. ఆ సినిమా తర్వాత ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు .. ఆ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఇప్పుడు చరణ్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడనే వార్త చక్కర్లు కొడుతుంది.. మరి అందులో నిజమెంత ఉందొ తెలియదు.. కానీ ఈ ప్రాజెక్ట్ ఇప్పటిలో సెట్స్ మీదకు వెళ్లేలా కనిపించడం లేదు. రామ్ చరణ్ తన పెండింగ్ ప్రాజెక్ట్‌లను త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారట. ఆ తర్వాతే తన నెక్స్ట్ మూవీ గురించి ఆలోచిస్తారని తెలుస్తుంది. రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో రంగస్థలం సినిమా వచ్చింది.. ఆ సినిమా ఎంత విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..
అయితే గతంలో వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతుందని వార్తలు వినిపించాయి.. అంతేకాదు కథ కూడా డిస్కషన్ అయ్యిందని సమాచారం .. మరి ఎప్పుడు అప్డేట్ ఇస్తారో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక సుకుమార్ సినిమాల విషయానికొస్తే .. ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప 2 సినిమా చేస్తున్నాడు .. ఆగస్టు 15 న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు..