Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ రన్ టైంపై క్లారిటీ..!
ప్రస్తుతం టాలీవుడ్లో భారీ నిడివి గల సినిమాల ట్రెండ్ నడుస్తోంది. కంటెంట్ బలంగా ఉంటే మూడు గంటలకు పైగా రన్ టైం ఉన్నా ప్రేక్షకులు ఆదరిస్తారని రీసెంట్గా ‘పుష్ప 2’ నిరూపించింది. ఈ క్రమంలోనే సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ సినిమా కూడా 3 గంటల కంటే ఎక్కువ నిడివితో ఉండబోతోందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. సినిమా రఫ్ కట్ ఏకంగా 4 గంటలకు పైగా వచ్చిందని, ఎడిటింగ్ తర్వాత కూడా అది 3 గంటల పైనే ఉంటుందని ప్రచారం జరిగింది.
Also Read :Sunny Leone Daughter: పదేళ్లకే సైంటిస్ట్‌గా మారినా సన్నీ లియోన్ కూతురు!
Also Read
- MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..
- Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?
- TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!
- Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. భవానీపూర్‌లో ఘోర పరాజయం
అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చిత్ర పి ఆర్ (PR) వర్గాలు కొట్టిపారేశాయి. సినిమా నిడివి గురించి వస్తున్నవన్నీ ఊహాగానాలేనని, అభిమానులు వీటిని నమ్మాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. షూటింగ్ దశలో ఉన్న సినిమా రన్ టైం గురించి ఇప్పుడే మాట్లాడటం సరికాదని, దర్శకుడు బుచ్చిబాబు ఒక పక్కా ప్లానింగ్‌తో సినిమాను రూపొందిస్తున్నారని తెలిపారు. ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆడియన్స్‌కు బోర్ కొట్టకుండా సరైన నిడివితోనే వస్తుందని భరోసా ఇచ్చారు.
వృద్ధి సినిమాస్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై నేషనల్ లెవెల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చరణ్ ఒక విభిన్నమైన లుక్‌లో కనిపిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
తాజావార్తలు
-
MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..
-
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
Indigo: టేకాఫ్ తర్వాత షాక్.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
-
Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?
-
TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!