గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. త్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ పాపులర్ అయ్యాడు.. ఆ తర్వాత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తున్న ఈయన ఈ సినిమా త్వరలోనే విడుదల చేసి బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు… ఆ తర్వాత మరో రెండు సినిమాలను లైన్లో పెట్టుకున్నాడు… అయితే చరణ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే తన టాలెంట్ తో స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.. తండ్రీ అడుగుజాడల్లోనే నడుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.. సోషల్ మీడియాలో నిరంతరం ఈయనకు సంబంధించిన ఏదో ఒక వార్త ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తూ ఉంటుంది.. ఇప్పుడు తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతుంది..
రామ్ చరణ్ మొబైల్ వాల్ పేపర్ ను చూసి అందరు షాక్ అవుతున్నారు.. దైవభక్తి రామ్ చరణ్ కు ఎక్కువగానే ఉందన్న విషయం తెలిసిందే.. ఆంజనేయస్వామి భక్తుడు కూడా.. ఈ క్రమంలోనే ఆయన మొబైల్ వాల్‌పేపర్ పిక్చర్ గా ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకున్నారు.. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.. ప్రస్తుతం ఆయన వాల్ పేపర్ ప్రస్తుతం వైరల్ గా మారింది.. ఇకపోతే అటు చిరంజీవి కూడా ఆంజనేయ స్వామి భక్తుడన్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం రామ్ చరణ్ బాబాయ్ కు మద్దతుగా పిఠాపురంలో ఉన్నాడన్న విషయం తెలిసిందే..