మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 350 కోట్ల క్లబ్‌లో చేరి ‘ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్’ దిశగా దూసుకుపోతోంది. సినిమాలో మెగాస్టార్ గ్రేస్, విక్టరీ వెంకటేష్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో మూవీ టీం వరుస ఇంటర్వ్యూలతో బిజిగా ఉంది. ఇందులో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో సుస్మిత చరణ్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. తన అక్క నిర్మాతగా ముందడువేసి విజయం సోంతం చేసుకున్న కారణంగా.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన అక్కకు ఒక క్యూట్ గిఫ్ట్ ఇచ్చాడట.
Also Read : Janhvi Kapoor : కరణ్ జోహార్ హ్యాండిచ్చిన జాన్వీ కపూర్..!
సుస్మిత కొణిదెల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తమ్ముడు రామ్ చరణ్ గురించి ఎమోషనల్ అయ్యారు. ‘నాన్నతో (చిరంజీవి) కలిసి ఈ సినిమాను చాలా బాగా నిర్మించావు.. సినిమా అద్భుతంగా వచ్చింది. ఇప్పుడు నీకు చాలా దిష్టి తగులుతుంది, కాబట్టి ఇది వేసుకో’ అని చెబుతూ చరణ్ తనకు ఒక ‘ఈవిల్ ఐ’ (Evil Eye) బ్రేస్‌లెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడని ఆమె తెలిపారు. తమ్ముడు చూపించిన ఆ ప్రేమాభిమానాలకు ఆమె మురిసిపోతున్నారు. సినిమా సక్సెస్‌తో మెగా ఫ్యామిలీ అంతా ఫుల్ జోష్‌లో ఉండగా, చరణ్ తన అక్కకు ఇచ్చిన ఈ స్పెషల్ గిఫ్ట్ మెగా అభిమానుల మనసు గెలుచుకుంటోంది.
