Peddi : పెద్ది పోస్ట్ పోన్ కాదని చెప్పండి : రామ్ చరణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే అంచనాలు భారీగా పెరిగాయి. అయితే, గత కొన్ని రోజులుగా ఈ చిత్రం విడుదల తేదీ విషయంలో సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 30 నుంచి వాయిదా పడిందని వస్తున్న వార్తలపై స్వయంగా రామ్ చరణ్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.
Also Read : Ramayana Part -1 Teaser : రాముడిగా రణబీర్ కపూర్.. ‘రామాయణ’ పార్ట్ -1 టీజర్ రిలీజ్
Also Read
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
ఇటీవల తన చెల్లెలు నిహారిక కొణిదెల నిర్మించిన ‘రాకాసి’ చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదలపై స్పందించాడు. రాకాసి టీమ్ తో చిట్ చాట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30 నుంచి పోస్ట్‌పోన్ అయ్యిందని నేను కూడా వింటున్నాను. కానీ ఆ వార్తల్లో నిజం లేదు. పెద్ది సినిమా లేట్ అవ్వదు.. అందరికీ ఇదే విషయం చెప్పండి” అంటూ చరణ్ చాలా స్పష్టంగా పేర్కొన్నారు. రామ్ చరణ్ స్వయంగా ఈ విషయంపై స్పందించడంతో ఈ నెలాఖరున అంటే ఏప్రిల్ 30న సినిమా పక్కాగా విడుదలవుతుందని మెగా అభిమానులు ఫుల్ ఖుషి ఉన్నారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అయితే ఇంకా రెండు సాంగ్స్, కొంత మేర ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉన్న పెద్ది చెప్పిన డేట్ కు వస్తాడా లేదా వాయిదా వేస్తారా అనేది త్వరలో తెలుస్తుంది.
తాజావార్తలు
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!