Ramayana Part -1 Teaser : రాముడిగా రణబీర్ కపూర్.. ‘రామాయణ’ పార్ట్ -1 టీజర్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’ (Ramayana). దర్శకుడు నితేష్ తివారీ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రం నుండి రాముడి పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ గ్లిమ్స్ రిలీజ్ చేసారు మేకర్స్. తాజాగా విడుదలైన టీజర్ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కేవలం టీజర్‌తోనే ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read
ఈ టీజర్‌లో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా కనిపించిన తీరు అద్భుతంగా ఉంది. ఆయన కళ్లలో కనిపించే ప్రశాంతత, రాజసం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఇక ఈ చిత్రంలో అత్యంత శక్తివంతమైన రావణుడి పాత్రలో రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్నారు. యష్ లుక్ రివీల్ చేయకండా బ్యాక్ షాట్స్ మాత్రమే చూపించారు. ఇక టీజర్‌లోని విజువల్స్ మరియు పాత్రల పరిచయం సినిమాపై ఉన్న అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి. ఈ గ్లింప్స్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ గురించి. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్‌లా కనిపిస్తూ ప్రాచీన భారతదేశాన్ని కళ్లముందు ఉంచుతోంది. వీటికి తోడు ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. సంగీతం మరియు విజువల్స్ కలయిక ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవబోతున్నాయని అనిపిస్తోంది. నిర్మాత నమిత్ మల్హోత్రా ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దీపావళికి ‘రామాయణ పార్ట్ 1’ విడుదల కానుండగా అప్పుడే ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయమనిపిస్తోంది.
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!