Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు జూన్ 20న పాప పుట్టిన సంగతి తెలిసిందే. తమ ఇంటి మహాలక్ష్మి పుట్టిందని ఫ్యామిలీ అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మెగాభిమానులు సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. సినీ ఇండస్ట్రీలో వినిపిస్తోన్న సమాచారం మేరకు శుక్రవారం మెగా ప్రిన్సెస్‌కు బారసాల కార్యక్రమం నిర్వహించబోతున్నారట. కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేయాలని మెగా ఫ్యామిలీ యోచిస్తున్నారు. అయితే రామ్ చరణ్, ఉపాసనలు ఆశ్చర్యపోయే గిఫ్ట్ ఒకటి.. వారి పాపకు వచ్చింది. అది పంపింది మరెవరో కాదు భారతదేశ కుబేరుడు రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ. ఇంతకీ మెగా కుటుంబమే అవాక్కయ్యే పెద్ద గిఫ్ట్ ఏమొచ్చిందా! అంటే ముఖేష్ అంబానీ దంపతులు ఏకంగా బంగారంతో ఊయల చేపించి పాప కోసం బహుమతిగా పంపారట. ఈ ఊయలలోనే పాపకు బారసాల వేడుక నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా వాళ్లు పంపించిన ఊయలను దాదాపు 2 కేజీలకు పైగా బంగారంతో తయారు చేయించినట్లు కూడా టాక్ వినిపిస్తోంది. అలా దీనికోసం అంబానీ రూ. 1.20 కోట్ల వరకూ ఖర్చు చేశారని అంటున్నారు.
Read more at: https://telugu.filmibeat.com/news/mukesh-ambani-gifted-golden-cradle-to-ram-charan-and-upasana-daughter-121119.html?story=3
Read Also:MLA Shakeel: బోధన్ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు
It’s a mega ceremony for the #MegaPrincess tomorrow. The baby is likely to be named during the event, by the mega power couple @AlwaysRamCharan and @upasanakonidela #RamCharan #GameChanger #GlobalStarRamCharan pic.twitter.com/r3MLNaijXQ
— SivaCherry (@sivacherry9) June 29, 2023
రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పెళ్లి జరిగిన 11 ఏళ్ల తర్వాత పాప పుట్టింది. ఈ మధుర క్షణాల కోసం తామెంతో ఎదురు చూశామని మెగా కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. పుట్టిన గంటల్లోనే పాప జాతకం అద్భుతం అంటూ వార్తలు బయటకు వచ్చేశాయి. పాప పుట్టిన తర్వాత చరణ్, ఉపాసన దంపతులు అత్త మామలు మెగాస్టార్చిరంజీవి – సురేఖలతోనే కలిసి ఉండబోతున్నామని స్పష్టం చేశారు. ఉపాసన డెలివరీ దగ్గర పడగానే రామ్ చరణ్ తన సినిమా షూటింగ్స్, ఇతర కార్యక్రమాల నుంచి బ్రేక్ తీసుకున్నారు. ప్రస్తుతం సమయాన్నంతా ఫ్యామిలీకే కేటాయిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షెడ్యూల్‌ను శంకర్ జూన్, జూలైలో ప్లాన్ చేశారు. అయితే రామ్ చరణ్ షెడ్యూల్‌ను ఆగస్ట్‌కి వాయిదా వేశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా కియారా అద్వానీ నటిస్తోంది. ఇదొక పొలిటికల్ థ్రిల్లర్. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్లో సినిమా రిలీజ్ అంటున్నారు.
Read Also:Delhi University: మోడీ పర్యటనతో ఢిల్లీ యూనివర్సిటీలో ఆంక్షలు.. నల్లరంగు దుస్తులు ధరించవద్దని ఆదేశాలు