NTV Telugu Site icon

Ram Charan : బుచ్చిబాబు, రామ్ చరణ్ సినిమా.. రెహమాన్ కు భారీ రెమ్యునరేషన్.. రెండు చిన్న సినిమాలు తీసేయొచ్చు

Ar Rahaman In Rc 16

Ar Rahaman In Rc 16

Ram Charan : రామ్‌ చరణ్ గత చిత్రం ‘గేమ్ ఛేంజర్’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో మెగా ఫ్యాన్స్ అందరూ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. తొలి సినిమా ‘ఉప్పెన’తో 100కోట్ల విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు, రామ్‌ చరణ్‌తో సినిమా అనే మాటనే ప్రేక్షకుల మధ్య ఆసక్తిని నెలకొల్పింది. సుకుమార్‌ శిష్యుడు అయిన బుచ్చిబాబు తన గురువు చిత్రాల తరహాలో మంచి సినిమా అందిస్తాడనే నమ్మకాన్ని కలిగి ఉన్నారు.

ఈ ప్రాజెక్ట్‌ను ఈ ఏడాది విడుదల చేయాలని బుచ్చిబాబు భావిస్తున్నారని సమాచారం అందుతోంది. ఇప్పటికే చాలా కాలం ప్రీ ప్రొడక్షన్‌లో బిజీగా ఉన్న ఆయన ఇప్పుడు షెడ్యూల్స్‌ను ముమ్మరంగా పూర్తి చేసి, ఆగస్టు నెలలో షూటింగ్‌ను ముగించాలని యోచిస్తున్నారు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నా ఈ సినిమాకు ప్లస్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

Read Also:Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నా.. చర్చకు నేను రెడీ..

రెహమాన్ ఇప్పటికే ఈ సినిమాకు కావాల్సిన పాటలను ట్యూన్ చేసి, ఆయన స్టైల్ సంగీతాన్ని అందించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రెహమాన్ ఇచ్చే పారితోషికం సుమారు రూ.8 కోట్లు అని తెలుస్తోంది. రెహమాన్‌తో కలిసి బుచ్చిబాబు ఇప్పటికే కొన్ని పాటలను ముందే సిద్ధం చేసి, రికార్డింగ్‌ చేయడం ప్రారంభించారని సమాచారం. ఇందువల్ల, సినిమాకు ఆలస్యం లేకుండా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు.

ఈ సినిమాకు సంబంధించి ఇతర ముఖ్య పాత్రలు కూడా ఆసక్తిని కలిగిస్తున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్‌ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే, త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ను, టీజర్‌ను కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. రామ్‌ చరణ్ బర్త్ డే స్పెషల్‌గా ప్రేక్షకులు ఎదురుచూసిన ఈ టీజర్‌తో రెహమాన్ తన సంగీతం ద్వారా తెలుగు ప్రేక్షకులను మరోసారి మంత్రముగ్దులను చేయబోతున్నాడు.

Read Also:YS Jagan: అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై జగన్‌ కీలక నిర్ణయం..