రకుల్ ప్రీత్ సింగ్ పేరుకు పరిచయం అక్కర్లేదు.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నా కూడా సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంది.. ఈ స్టార్ లేడీ వరుస ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తున్నారు. తాజాగా డిజైనర్ వేర్లో పరువాల వరద పరిచింది.. ఈ ఫోటోలను నెట్టింట షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. రకుల్ ప్రీత్ ఫిట్నెస్ ఫ్రీక్. ఈ జీరో సైజ్ భామ కఠిన వ్యాయామం చేసి ఫిట్ అండ్ స్లిమ్ బాడీ మైంటైన్ చేస్తుంది. మరి కష్టపడి సాధించిన పరువాలు దాచుకుంటే ఏం లాభం అనుకుంటూ క్లివేజ్ షో చేస్తుంది..
ఇక 2023లో ఛత్రీవాలి మూవీతో హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రంలో రకుల్ కండోమ్ టెస్టర్ గా నటించడం విశేషం. ప్రస్తుతం రకుల్ మేరీ పత్నికా రీమేక్ అనే చిత్రంలో నటిస్తున్నారు.. హీరోయిన్ గా నటిస్తున్న బడా ప్రాజెక్ట్ భారతీయుడు 2. వివాదాలతో ఆగిపోయిన భారతీయుడు 2 ఇటీవల తిరిగి పట్టాలెక్కింది. ఆ మూవీలో కాజల్ అగర్వాల్ తో పాటు రకుల్ హీరోయిన్ గా నటిస్తుంది..
ఈ అమ్మడు చివరగా తెలుగులో నటించిన చెక్, కొండపొలం చిత్రాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో మేకర్స్ ఆమెను పట్టించుకోవడం లేదు. బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన రకుల్ టాలీవుడ్ ని నిర్లక్ష్యం చేసింది. ప్రస్తుతం రకుల్ చేతిలో ఒక్క తెలుగు సినిమా లేదు..మరోవైపు పెళ్లి పుకార్లతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు. 2021లో రకుల్ నటుడు నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్లు వెల్లడించారు.. వరుస సినిమాలు ఉండటంతో పెళ్లికి బ్రేక్ ఇచ్చారు.. ఈ ఏడాది రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ ఏడడుగులు వేయడం ఖాయం అంటున్నారు. రకుల్ మాత్రం ఇంకా సమయం ఉందంటున్నారు.. ప్రస్తుతం బాలివుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది..