Do you know Raksha Bandhan Rules, Direction and Knots: సోదరుడు, సోదరి మధ్య బంధానికి చిహ్నం ‘రాఖీ పండుగ’. సోదర-సోదరీమణుల గౌరవం, ప్రేమను రక్షా బంధన్ ప్రతిబింబిస్తుంది. రక్షా బంధన్ పండుగను శ్రావణ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది రాఖీ పండుగ ఆగస్టు 9న వచ్చింది. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. రాఖీ కట్టడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. రాఖీని ఏ దిక్కున కూర్చుని కట్టుకోవాలి, సోదరీమణులు తమ సోదరుడి మణికట్టుకు రాఖీతో ఎన్ని ముడులు వేస్తే శుభప్రదమో ఇప్పుడు తెలుసుకుందాం.
రాఖీ కట్టడానికి సరైన దిశ:
రక్షాబంధన్ రోజున రాఖీ కట్టబోయే ప్రదేశంలో ముందుగా గంగాజలంతో శుభ్రం చేయాలి. రాఖీపై కూడా గంగాజలాన్ని చల్లాలి. తరువాత ప్లేటులో రాఖీ, పువ్వులు, కుంకుమ, అక్షింతలు, దీపం, స్వీట్లు మొదలైనవి పెట్టుకోవాలి. రాఖీ కట్టే ఆడపిల్లలు తమ సోదరుడిని ఉత్తరం లేదా తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలి. సోదరీమణులు ఆ దిశకు ఎదురుగా కూర్చోవాలి. ఇంట్లోని పూజా గది ఈ దిశలో ఉంటే.. అక్కడే రాఖీ కట్టండం మంచిది.
రాఖీ కట్టేటప్పుడు ఎన్ని ముడులు వేయాలి:
రాఖీ కట్టే ముందు సోదరీమణులు తమ సోదరుడి తలపై లేదా భుజంపై టవల్ వేయాలి. ఆపై కుంకుమతో బొట్టు పెట్టాలి. ఆపై కుడి మణికట్టుపై రాఖీ కట్టాలి. రాఖీ కట్టేటప్పుడు మూడు ముడులు వేయడం సంప్రదాయం. రాఖీలోని మూడు ముడులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని నమ్ముతారు. రాఖీ కట్టేటప్పుడు ‘ఓం యేన్ బద్ధో బలి రాజా, దానవేంద్ర మహాబల్: పది త్వం కమిటినామి రక్షే మచల్ మచల్’ అనే మంత్రాన్ని జపించండి. ఆ తరువాత సొందరుడికి స్వీట్లు తినిపించి హారతి ఇవ్వాలి. చివరగా సోదరులు తమ సోదరీమణులకు బహుమతులు ఇవ్వాలి.
Also Read: Gold Rate Today: ఆగని పసిడి పరుగు.. కొనాలంటే కష్టమే! నేటి గోల్డ్ రేట్స్ ఇలా
శుభముహుర్తం:
2025 రక్షా బంధన్ నాడు భద్రుడి నీడ ఉండదు కానీ.. రాహుకాలాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. రాహుకాల సమయంలో శుభ కార్యక్రమాలు నిర్వహించబడవు. కాబట్టి ఆగస్టు 9న ఉదయం 9:08 నుంచి 10:47 వరకు రాఖీ కట్టకండి. శుభ సమయం ఉదయం 5:47 నుంచి మధ్యాహ్నం 1:24 వరకు. అత్యంత శుభ సమయం 7 గంటల 37 నిమిషాలు. నియమాలను అనుసరిస్తూ జరుపుకునే రాఖీ పండగ ఎప్పుడూ కూడా శుభప్రదం అవుతుంది. రక్షా బంధన్ కారణంగా తోబుట్టువుల మధ్య ఉన్న సంబంధం బలోపేతం అవుతుంది.
పూజ సమగ్రి:
ప్లేట్, రాఖీ, కుంకుమ, అక్షింతలు, దీపం, స్వీట్లు, పువ్వులు, కొబ్బరి