Raksha Bandhan 2025 Auspicious Time to Tie Rakhi on August 9: భారతీయ సంస్కృతిలో ‘రాఖీ పండుగ’కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సోదర, సోదరీమణుల మధ్య ప్రేమ, నమ్మకానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగే ‘రక్షా బంధన్’. అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ముల చేతికి రాఖీని కట్టి.. తమ సోదరులకు దీర్ఘాయుష్షు, ఆనందం, శ్రేయస్సు లభించాలని ఆ భగవంతుడిని కోరుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 9న శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ పండుగ చేసుకోవడానికి అక్కచెల్లెళ్లు సిద్ధమవుతున్నారు. అయితే రాఖీ కట్టడానికి శుభ సమయం ఉంటుంది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.
ఈసారి రాఖీ పండుగ శనివారం (ఆగస్టు 9) రోజున వచ్చింది. సంతోషకరమైన విషయం ఏమిటంటే.. పండుగ రోజున భద్రుడి (అశుభ కాలం) నీడ ఉండదు. కాబట్టి సోదరీమణులు ఎప్పుడైనా తమ సోదరులకు రాఖీ కట్టవచ్చు. కానీ ఉదయం 09:08 నుంచి 10:47 వరకు రాఖీ కట్టకండి. ఎందుకంటే ఈ సమయంలో రాహుకాలం ఉంటుంది. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. రాఖీ కట్టడానికి శుభ సమయం ఉదయం 5:47 నుంచి మధ్యాహ్నం 1:24 వరకు ఉంది. రాహుకాలంలో మినహాయించి మిగతా సమయాల్లో రాఖీ కట్టడానికి అనువైన సమయం.
Also Read: Congress Dharna: నేడు ఢిల్లీలో కాంగ్రెస్ మహాధర్నా.. హాజరుకానున్న ఏఐసీసీ అగ్రనేతలు!
రాహుకాల సమయం:
రాఖీ పండుగ రోజున రాహుకాల సమయం ఉదయం 09:08 నుంచి 10:47 వరకు ఉంది. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం రాహుకాలంలో ఎటువంటి శుభ కార్యాలు జరగవు. భారతీయ సంస్కృతిలో రక్షా బంధన్ పండుగ పవిత్రమైన, భావోద్వేగ సంబంధాలకు చిహ్నం. ముఖ్యంగా సోదరుడు, సోదరి మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడానికి జరుపుకుంటారు. కాబట్టి రక్షా బంధన్ రోజున రాహుకాల సమయాన్ని గుర్తుంచుకోండి.
శుభ సమయం:
ఆగస్టు 9న రాఖీ కట్టడానికి శుభ సమయం ఉదయం 5:47 నుంచి మధ్యాహ్నం 1:24 వరకు. రక్షాబంధన్‌కు శుభ సమయం ఉదయం 7 గంటల 37 నిమిషాలు. ఈ సమయంలో రాఖీ కడితే అన్ని శుభాలే జరుగుతాయి.