సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్‌లో విద్యార్థుల అంతిమయాత్రలో రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ దుర్ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ముషీరాబాద్‌లోని బోలక్ పూర్ డివిజన్ ఇందిరానగర్‌కు చెందిన అన్నదమ్ములు గ్యార ధనుశ్, గ్యార లోహిత్ ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం హృదయాన్ని కలిచివేసిందని ఆయన అన్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈరోజు ధనుశ్, లోహిత్ అంతిమయాత్రలో డాక్టర్ కె. లక్ష్మణ్ పాల్గొని, ఈ కష్టసమయంలో బాధిత కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేశారు. పుత్రశోఖంలో ఉన్న తల్లిదండ్రులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందించాలని డాక్టర్ కె. లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు.
Stock Market : ముంబై నుండి కరాచీ వరకు దయనీయ స్థితిలో స్టాక్ మార్కెట్.. దివాళా తీస్తున్న ఇన్వెస్టర్లు
కొండపోచమ్మ సాగర్ వద్ద ఇప్పటికే అనేకమంది ప్రాణాలు కోల్పోయినా భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయకపోవడం పట్ల లక్ష్మణ్ … ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రిజర్వాయర్ పరిసరాల్లో భద్రతా చర్యలు తీసుకునేలా సెక్యూరిటీని పెంచాలని సూచించారు. బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారంతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బాధిత కుటుంబంలో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Chittoor: తీవ్ర విషాదం.. పిల్లలతో సహా తల్లి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం