Site icon NTV Telugu

Rajnath Singh: బ్రహ్మోస్‌ తయారీ యూనిట్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన రాజ్‌నాథ్‌ సింగ్‌..

Raj Nath

Raj Nath

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం లక్నోలో కొత్త బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఉత్పత్తి యూనిట్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగమైన ఈ యూనిట్ భారతదేశ స్వదేశీ రక్షణ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలువనుంది. ఈ సందర్భంగా రాజ్ నాథ్ మాట్లాడుతూ.. నేను లక్నో ఎందుకు రాలేకపోయానో మీ అందరికి తెలుసు.. ఇదే రోజున శాస్త్రవేత్తలు పోఖ్రాన్‌లో అణుపరీక్షలు చేశారు.. 40 నెలల్లోనే ఈ ప్రొడక్షన్‌ యూనిట్‌ను పూర్తిచేశారు.. ఇంత తక్కువ సమయంలో ఈ యూనిట్‌ సిద్ధం చేసిన వారికి అభినందనలు తెలిపారు.

Also Read:Ponnam Prabhbakar : కుల గణన మీద అనుమానాలు ఉంటే నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం

రూ. 300 కోట్ల వ్యయంతో నిర్మించబడిన ఈ ఉత్పత్తి యూనిట్ ఏటా 80 నుంచి 100 బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేయడానికి రూపొందించారు. భారతదేశ రక్షణ పరిశోధన అండ్ అభివృద్ధి సంస్థ (DRDO), రష్యా NPO మషినోస్ట్రోయేనియా మధ్య జాయింట్ వెంచర్ అయిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ద్వారా అభివృద్ధి చేయబడిన ఈ బ్రహ్మోస్ క్షిపణి 290 నుంచి 400 కి.మీ. పరిధి కలిగిన, మాక్ 2.8 వేగంతో దూసుకెళ్తుంది.

Exit mobile version