Rajinikanth : రజనీకాంత్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్..తలైవర్ స్పీడ్ మామూలుగా లేదుగా!

Rajanikanth

Rajanikanth

సూపర్ స్టార్ రజనీకాంత్ తన 75వ ఏట కూడా కుర్ర హీరోలకు పోటీనిస్తూ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్టుల అప్‌డేట్స్ చూస్తుంటే, రాబోయే రెండేళ్లూ బాక్సాఫీస్ వద్ద ‘తలైవర్’ జాతర ఖాయమనిపిస్తోంది. ‘జైలర్ 2’ షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడం నుండి కమల్ హాసన్‌తో మల్టీస్టారర్ వరకు రజనీ ఫుల్ బిజీగా ఉన్నారు.

Also Read : Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ ఇండియాలో 6 నిమిషాల సీన్లు కట్.. వయోలెన్స్‌పై బోర్డు సీరియస్!

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘జైలర్ 2’ (Hukum) షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఇందులో ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారట. రజనీకాంత్ ఇప్పటికే తనసీన్స్ షూట్ పూర్తి చేయగా మార్చి నెలాఖరులో షారుఖ్ తన సీన్ల షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు దిగ్గజాలను ఒకే ఫ్రేమ్‌లో చూడటం అభిమానులకు కంటి పండగే!

రజనీకాంత్ తన తదుపరి చిత్రం ‘తలైవర్ 173’ షూటింగ్‌ను ఏప్రిల్ నుండి ప్రారంభించనున్నారు. ‘డాన్’ సినిమాతో మెప్పించిన యంగ్ డైరెక్టర్ సిబి చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కమల్ హాసన్ తన సొంత బ్యానర్ ‘రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్’పై ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. ఇది పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారని సమాచారం. ఈ సినిమాను 2027 పొంగల్ కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Also Read : Dhurandhar2 : ధురంధర్ 2’ తెలుగు ప్రీమియర్స్ రద్దు.. బుకింగ్స్ ఆపేసిన ‘PVR INOX’

మోస్ట్ అవేటెడ్ మల్టీస్టారర్: KH x RK : దాదాపు 46 ఏళ్ల తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్  KHxRK. రెడ్ జెయింట్ మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం షూటింగ్ కూడా ఈ ఏడాదే ప్రారంభం కానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రోమో నెట్టింట వైరల్ అయ్యింది. పాత కాలపు వింటేజ్ లుక్‌లో ఈ ఇద్దరు స్టార్స్ కనిపిస్తారని టాక్. ఈ ప్రాజెక్ట్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.