Rajinikanth: కేరళలో సూపర్ స్టార్ మూవీ షురూ.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ఇటీవల జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తలైవా ఆ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. అయితే జైలర్ సంచలన విజయం సాధించి అభిమానులను ఫుల్ ఖుష్ చేసింది. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ ఏకంగా 700కోట్లకు పైగా వసూల్ చేసింది. జైలర్ ను లేపింది అనిరుధ్ సంగీతం అనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఓటీటీలోనూ జైలర్ మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది.. అక్కడ కూడా హిట్ ను అందుకుంది..
ఇకపోతే ప్రస్తుతం రజినీకాంత్ లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ మూవీలో చాలా మంది స్టార్ నటులు నటిస్తున్నారు. లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లియో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్స్ కు లోకేష్ పెట్టింది పేరు. గతంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన ఖైదీ విక్రమ్ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇక ఈ సినిమా కూడా హిట్ అవుతుందని తలైవా ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు..
Also Read
- Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
- Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
- Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
- Nirmala Sitharaman: "వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు".. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
తాజాగా విడుదలైన విజయ్ లియో ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది..ఇక ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ ను కూడా మొదలు పెట్టేశాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ షూటింగ్ కేరళలో మొదలైంది. సూపర్ స్టార్ కావడంతో షూటింగ్ స్పాట్ కు అభిమానులు భారీగా వచ్చారు. షూటింగ్ స్పాట్‌కి రజనీ వచ్చినప్పుడు తలైవా అంటూ నినాదాలు చేస్తూ హంగామా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలు సూపర్ స్టార్ మరింత యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రానా వంటి స్టార్స్ కీలక పాత్రలో నటిస్తున్నారు..
The wait is over! #Thalaivar170 – Trivandrum Day -2 Visuals are here watch: ⚔️📷#Thalaivar170 #Trivandrum #Shangumugam #Thalaivar170Team #KeralaRajinikanthFans @aksrfrajini #ThalaivarNirandharam #SuperstarRajinikanth @rajinikanth @RIAZtheboss
Credits: – Shyam Kumar pic.twitter.com/jjKj57Cobg
— AKSRF Rajini Kerala (@aksrfrajini) October 5, 2023
తాజావార్తలు
-
Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
-
Smriti Mandhana History: స్మృతి మంధాన వరల్డ్ రికార్డు.. మహిళల క్రికెట్లో ఇదే తొలిసారి!
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Nirmala Sitharaman: “వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు”.. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
ట్రెండింగ్
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!