లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీ కాంత్, టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ వంటి స్టార్స్ నటిస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ ముల్టీస్టారర్ గా రాబోతున్న చిత్రం కూలీ. దానికి తోడు బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ క్యామియోలో నటిస్తున్నాడు. ఇప్పడు ఎక్కడ చుసిన కూలీ పవర్ కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లోను మాస్ పవర్ చూపిస్తోంది.
కూలీ అడ్వాన్సు బుకింగ్స్ అటు ఇటుగా రూ. 80 కోట్లు ఉన్నాయి. అయితే ఇంత భారీ వసూళ్లు రాబట్టడానికి సూపర్ స్టార్ రజినీ పవర్ అని కొందరు అంటే లేదు లేదు లోకేష్ కనకరాజ్ కారణమని మరొకొందరు వాదిస్తున్నారు. కానీ వాస్తవంగా చూసుకుంటే ఇంతటి భారీ బుకింగ్స్ కు రజనీ ఫ్యాక్టర్ కారణం కానే కాదు. ఒకసారి రజిని గత చిత్రాలైన లాల్ సలామ్, వెట్టయాన్ వసూళ్లు గమనిస్తే క్లారిటీగా అర్ధం అవుతుంది. ఆ రెండు సినిమాలు మినిమం ఓపెనింగ్ రాబట్టడానికి ముక్కి మూలిగాయి. ఇటు లోకేష్ కనకరాజ్ గత చిత్రాలు లియో, విక్రమ్ అడ్వాన్స్ బుకింగ్స్ నుండి ఫైనల్ రన్ వరకు అదరగోట్టాయి. డైరెక్టర్ లోకేష్ ఇప్పుడు తమిళనాట సెన్సేషన్. మనోడు డైరెక్షన్ అంటే చాలు హీరోతో సంబంధం లేకుండా క్రేజ్ పెరుగుతుంది. ఇప్పుడు కూలీ విషయంలోను ఇదే జరుగుతోంది. లోకేశ్ కనకరాజ్ క్రెడిబిలిటీకి రజినీ స్టార్ పవర్ యాడ్ అయింది అంతే. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కి కూడా క్రెడిట్ ఇవ్వాలి. ఓవరాల్ గా కూలీ అడ్వాన్స్ బి బుకింగ్స్ అదరగొడుతుంది కానీ అందులో మెజారిటీ క్రెడిట్ లోకేష్ కనకరాజ్ కు దక్కుతుంది.
Note : ఇక్కడ రజినీని తక్కువ చేసినట్టు కాదు జస్ట్ వివరణ మాత్రమే. తలైవా ఎప్పటికి వన్నె తగ్గని ఓ స్టార్ పవర్