Site icon NTV Telugu

Rajinikanth: 5 రూపాయల పరోటా వెనుక సూపర్ స్టార్ కథ.. అభిమాని చేసిన పనికి రజినీ ఫిదా!

Super Star Rajini, Rajini Fan Madurai,

Super Star Rajini, Rajini Fan Madurai,

సినిమా హీరోలను దేవుళ్లలా ఆరాధించడంలో తెలుగు, తమిళ ప్రేక్షకులకు మించిన వారు ఉండరు. అయితే ఈ రోజుల్లో అభిమానం అంటే సోషల్ మీడియాలో ఇతర హీరోలపై విషం చిమ్మడం, ఫ్యాన్ వార్స్ చేసుకోవడమే పనిగా మారిపోయింది. కానీ, పాత తరం అభిమానులు మాత్రం తాము ఆరాధించే హీరో పేరు మీద సమాజానికి మేలు చేసే పనులు చేస్తూ, తమ హీరో కీర్తిని దశదిశలా వ్యాపింపజేస్తుంటారు. సరిగ్గా అలాంటి ఒక అరుదైన అభిమాని కథే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : Manchu Manoj: ‘డేవిడ్ రెడ్డి’గా మంచు మనోజ్.. రా, రూత్ లెస్ లుక్ అదిరిపోయిందిగా!

తమిళనాడుకు చెందిన శేఖర్ అనే వ్యక్తికి రజనీకాంత్ అంటే ప్రాణం. మదురైలో హోటల్ నడుపుతున్న శేఖర్, గత 15 ఏళ్లుగా కేవలం 5 రూపాయలకే పరోటా అందిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. హోటల్ నిండా రజినీ ఫోటోలు, ఒంటిపై రజినీ పచ్చబొట్టు.. ఇలా శేఖర్ ప్రపంచమంతా సూపర్ స్టారే! ప్రస్తుత రోజుల్లో ఐదు రూపాయలకే పరోటా ఇవ్వడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. లాభాల కంటే ప్రజల కడుపు నింపడమే ముఖ్యమని భావించే శేఖర్ గొప్ప మనసు గురించి తెలుసుకున్న రజనీకాంత్ చలించిపోయారు. తనపై ఇంతటి అపారమైన ప్రేమను చూపిస్తున్న అభిమానిని రజినీ స్వయంగా కలిసి సత్కరించారు. అంతేకాదు, శేఖర్ సేవలకు గుర్తుగా ఒక బంగారు చైన్ ను బహుమతిగా ఇచ్చి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఒక సామాన్య అభిమాని చేసిన పనికి సాక్షాత్తూ సూపర్ స్టారే ఫిదా అవ్వడం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

 

Exit mobile version