Rajinikanth: 5 రూపాయల పరోటా వెనుక సూపర్ స్టార్ కథ.. అభిమాని చేసిన పనికి రజినీ ఫిదా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా హీరోలను దేవుళ్లలా ఆరాధించడంలో తెలుగు, తమిళ ప్రేక్షకులకు మించిన వారు ఉండరు. అయితే ఈ రోజుల్లో అభిమానం అంటే సోషల్ మీడియాలో ఇతర హీరోలపై విషం చిమ్మడం, ఫ్యాన్ వార్స్ చేసుకోవడమే పనిగా మారిపోయింది. కానీ, పాత తరం అభిమానులు మాత్రం తాము ఆరాధించే హీరో పేరు మీద సమాజానికి మేలు చేసే పనులు చేస్తూ, తమ హీరో కీర్తిని దశదిశలా వ్యాపింపజేస్తుంటారు. సరిగ్గా అలాంటి ఒక అరుదైన అభిమాని కథే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : Manchu Manoj: ‘డేవిడ్ రెడ్డి’గా మంచు మనోజ్.. రా, రూత్ లెస్ లుక్ అదిరిపోయిందిగా!
Also Read
- 8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
- UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
- Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
- Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
తమిళనాడుకు చెందిన శేఖర్ అనే వ్యక్తికి రజనీకాంత్ అంటే ప్రాణం. మదురైలో హోటల్ నడుపుతున్న శేఖర్, గత 15 ఏళ్లుగా కేవలం 5 రూపాయలకే పరోటా అందిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. హోటల్ నిండా రజినీ ఫోటోలు, ఒంటిపై రజినీ పచ్చబొట్టు.. ఇలా శేఖర్ ప్రపంచమంతా సూపర్ స్టారే! ప్రస్తుత రోజుల్లో ఐదు రూపాయలకే పరోటా ఇవ్వడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. లాభాల కంటే ప్రజల కడుపు నింపడమే ముఖ్యమని భావించే శేఖర్ గొప్ప మనసు గురించి తెలుసుకున్న రజనీకాంత్ చలించిపోయారు. తనపై ఇంతటి అపారమైన ప్రేమను చూపిస్తున్న అభిమానిని రజినీ స్వయంగా కలిసి సత్కరించారు. అంతేకాదు, శేఖర్ సేవలకు గుర్తుగా ఒక బంగారు చైన్ ను బహుమతిగా ఇచ్చి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఒక సామాన్య అభిమాని చేసిన పనికి సాక్షాత్తూ సూపర్ స్టారే ఫిదా అవ్వడం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
Since 1975 The bond between #Rajinikanth and his fans..
Recently a viral video showed a person from madurai who is a diehard fan sells parotta at 5rs at his hotel. Thalaivar gifted gold chainBest moment for a fan ❤️ That's how the bond between loyal fans and Rajini since 1975 pic.twitter.com/TCzW9oxxm5
— Minnal_Magy (@MagyMagesh1) January 25, 2026
తాజావార్తలు
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
-
Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
-
IndiGo Flight: ల్యాండింగ్‌కు ముందు రన్‌వేను తాకిన ఇండిగో విమానం.. గో-అరౌండ్తో తప్పిన ప్రమాదం
ట్రెండింగ్
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!