NTV Telugu Site icon

Rajinikanth Fans: రజనీకాంత్ ఫ్యాన్స్‌ భేటీ.. మంత్రి రోజాకు సీరియస్‌ వార్నింగ్‌..

Rajinikanth

Rajinikanth

Rajinikanth Fans: విజయవాడ వేదికగా జరిగిన ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలకు తప్పుబడుతోంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఎన్టీఆర్‌తో తనకున్న పరిచయం, అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూనే.. చంద్రబాబు, బాలయ్యపై ప్రశంసలు కురిపించారు రజనీ.. ఇక, చంద్రబాబు విజన్‌.. హైదరాబాద్‌ అభివృద్ధి వంటి అంశాలను కూడా ప్రస్తావించారు.. దీంతో, ఆయన వైసీపీకి టార్గెట్‌గా మారిపోయారు.. అయితే, పుదుచ్చేరిలో రజనీకాంత్ అభిమాన సంఘం నేతల సమావేశం అయ్యారు. ఏపీ మంత్రి రోజాకు.. రజనీకాంత్ అభిమానుల సీరియస్‌ వార్నింగ్ ఇచ్చారు. రజనీకాంత్ ను విమర్శించే స్ధాయి రోజాకు లేదని హితవుపలికారు.. చేసినా విమర్శలు వెంటనే క్షమాపణ చెప్పాలి.. లేదంటే పెద్ద ఎత్తున నిరసన చేపడుతాం అంటూ హెచ్చరించారు.. మరోసారి రజనీకాంత్‌పై మాట్లాడితే వదిలే ప్రసక్తేలేదన్నారు..

Read Also: Heavy Rain: ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు వార్నింగ్‌..!

కాగా, మొన్న పుదుచ్చేరిలో ఓ ఆలయాన్ని సందర్శించిన సమయంలో రజనీకాంత్ జీరో అంటూ విమర్శించారు మంత్రి ఆర్కే రోజా.. తిరుకంచి గంగై వరదరాజు నాదీశ్వర ఆలయంలో పుష్కరిణి ఉత్సవాల్లో పాల్గొనేందుకు పుదుచ్చేరి వెళ్ళిన రోజా.. రజనీకాంత్ పై విమర్శలు గుప్పించారు. రజినీకాంత్ పై ఎన్టీఆర్ అభిమానులు కోపంగా ఉన్నారని పేర్కొన్న రోజా, రజినీకాంత్ తాను చేసిన వ్యాఖ్యలతో జీరో అయ్యారని విమర్శించారు. రజినీకాంత్ ఇన్నాళ్ళుగా సంపాదించుకున్న పేరు పోగొట్టుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. అసలు రాజకీయాలు వద్దు అనుకున్న రజినీకాంత్.. మళ్లీ ఎందుకు రాజకీయాలు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు రోజా.. చంద్రబాబుతో కలిసిన రజినీకాంత్ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన సందర్భంలో ఉన్నారని, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుని చంద్రబాబు చేసిన అరాచకం అంతా రజినీకాంత్ కు తెలుసని.. అప్పుడు చంద్రబాబుకు రజినీకాంత్ మద్దతుగా నిలిచారని, అందుకు సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అని మంత్రి ఆర్కే రోజా పేర్కొన్న విషయం విదితమే.