Rajeev Kanakala: టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒక్కరైనా రాజీవ్ కనకాల తాజాగా జరిగిన లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు చీఫ్ గెస్ట్‌గా అల్లు అరవింద్, అలాగే విజయ్ దేవరకొండ, బండ్ల గణేష్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఈ వేదికగా రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. ఈ అద్భుతమైన వేడుకలో భాగమవ్వడం నాకు గర్వకారణం. నా టీమ్ మెంబర్స్‌కి హృదయపూర్వక అభినందనలని తెలిపారు. ఈ విజయం వెనుక ఉన్న ప్రధాన కారణం బన్ని వాసు, వంశీ.. అంటూనే, మీరు లేకపోతే ఈ స్థాయి విజయాన్ని సాధించడం అసాధ్యం అన్నారు. మీ వల్లే ప్రజల్లోకి ఈ సినిమా ఇంతలా చేరిందని ఆయన అన్నారు.
OG Car Show: ఇదెక్కడి అభిమానం భయ్యా.. OG సినిమా కోసం అట్లాంటా ఫ్యాన్స్ ఏకంగా?
అలాగే, ఈ ప్రాజెక్ట్‌పై నమ్మకంతో ముందుకు వచ్చిన నితిన్ , సాయి కృష్ణ, అలాగే తనకు మంచి పాత్రను ఇచ్చిన సాయి మార్తాండుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే మీరు నన్ను ‘గోపాలరావు అంకుల్’ అని పిలిచే స్థాయికి తీసుక వెళ్లారని ఆయన అన్నారు. నిజంగానే ఇది నా సెకండ్ ఇన్నింగ్స్ లా అనిపిస్తోంది అంటూ మాట్లాడారు. ఇక లిటిల్ హార్ట్స్ లోని తన పాత్ర వల్ల తాను మరో 6–7 సినిమాలకు ఆఫర్లు స్వీకరించానని అన్నారు. ఈ విజయం మొత్తం మీ అందరి వల్లే సాధ్యమైంది. ఈ సినిమాలో మ్యూజిక్ ముఖ్యమైన బలం. ఆ మ్యూజిక్ ద్వారా నేను, నా భార్య సుమ చిన్న చిన్న రీల్స్ కూడా చేసి ఎంజాయ్ చేశాం అని పేర్కొన్నారు.
Karnataka: రోజూ ఫుడ్ కు బదులు ఇంజిన్ ఆయిల్ తాగుతున్న వ్యక్తి.. వీడియో వైరల్
అలాగే ఈ సినిమాను ఇంత విజయవంతం చేసినందుకు అభిమానులకు, ప్రేక్షకులకు, పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా థియేటర్స్‌కి వచ్చి సినిమా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నానని రాజీవ్ కనకాల అన్నారు.