Rajat Patidar: డేవిడ్ వార్నర్ రికార్డ్ ను సమం చేసిన ఆర్సీబీ కెప్టెన్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajat Patidar: ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) మరోసారి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. మంగళవారం ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) పై 92 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఫైనల్ లోకి దూసుకెళ్లింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలో ఇదే అత్యధిక జట్టు స్కోరు. ఇదివరకు 2023 క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్‌పై చేసిన 233/3 రికార్డును ఆర్సీబీ బద్దలు కొట్టింది.
ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ అద్భుత ఇన్నింగ్స్‌తో సంచలనం సృష్టించాడు. మొదట 13 బంతుల్లో 21 పరుగులతో నెమ్మదిగా ఆడిన పటీదార్, ఆ తర్వాత గుజరాత్ బౌలర్లపై శివతాండవం సృష్టించాడు. చివరి 20 బంతుల్లోనే 72 పరుగులు రాబట్టి.. మొత్తం 33 బంతుల్లో అజేయంగా 93 పరుగులు చేశాడు. పటీదార్ ఈ ఇన్నింగ్స్‌తో ఓ అరుదైన రికార్డును కూడా సమం చేశాడు. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో కెప్టెన్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్ సరసన నిలిచాడు. వార్నర్ 2016 క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 93 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
Also Read
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై పిల్ కొట్టేయండి.. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్
- Saturday Horoscope: సెప్టెంబర్ 5 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
- Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
- Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
254 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ బ్యాటర్స్ ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు చేతులెత్తేశారు. ఇన్నింగ్స్ మొదటి నుంచే వికెట్లు కోల్పోతూ ఒత్తిడిలో పడిన గుజరాత్, ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. దీంతో ఆర్సీబీ సునాయాసంగా 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ ఐపీఎల్ 2026 ఫైనల్ కు చేరి టైటిల్ ఫేవరెట్‌గా మారింది. దీనికి కారణం చరిత్ర కూడా ఇప్పుడు ఆర్సీబీకే అనుకూలంగా ఉంది. 2018 నుంచి ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ప్రతి జట్టు కూడా క్వాలిఫయర్-1 గెలిచిన జట్టే. గత ఏడాది కూడా ఆర్సీబీ క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి, అనంతరం ఫైనల్లో విజయం సాధించి తమ తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.
మొత్తంగా 2011లో ప్లేఆఫ్స్ వ్యవస్థ వచ్చినప్పటినుండి 15 సీజన్లలో 12 సార్లు క్వాలిఫయర్-1 గెలిచిన జట్టే చివరికి ఛాంపియన్‌గా నిలిచింది. కేవలం మూడు సార్లు మాత్రమే ఆ జట్లు ఫైనల్లో ఓడిపోయాయి. అందులో 2016లో ఆర్సీబీ కూడా ఒకటి. అప్పట్లో క్వాలిఫయర్-1 గెలిచినా, ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో పరాజయం పాలైంది. చూడాలిమరి ఈసారి పరిస్థి ఎలా ఉండబోతుందో.
తాజావార్తలు
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై పిల్ కొట్టేయండి.. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్
-
Saturday Horoscope: సెప్టెంబర్ 5 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!