Road Accidents: దేవుడి దర్శనం కోసం వెళ్లి మృత్యుఒడిలోకి.. ఒకే రాత్రి 12 మంది మృతి, 21 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan Road Accidents: దేవుడి దర్శనం కోసం బయలుదేరిన వాళ్లను మృత్యువు దారిలోనే కాటేసింది! రాజస్థాన్‌లో (Rajasthan) జరిగిన రెండు వేర్వేరు ఘోర రోడ్డు ప్రమాదాల్లో (Road Accidents) ఏకంగా 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ వరుస యాక్సిడెంట్లు తీవ్ర విషాదాన్ని నింపాయి. మొదటి ప్రమాదం రాజస్థాన్‌లోని కోటా-ఉదయ్‌పూర్ నేషనల్ హైవేపై (Kota-Udaipur National Highway) చోటుచేసుకుంది. నతా పోలీస్ స్టేషన్ పరిధిలోని శంభూపుర (Shambhupura) గ్రామం దగ్గర రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక ట్రక్కును వేగంగా వచ్చిన క్రూజర్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నపిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు.
అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే.. మహారాష్ట్రకు (Maharashtra) చెందిన ఈ కుటుంబం మొత్తం 16 మందితో కలిసి ఖాటు శ్యామ్ జీ (Khatu Shyam Ji) ఆలయ దర్శనం ముగించుకుని తిరిగి ఇంటికి బయలుదేరింది. అదే వాళ్ల చివరి దర్శనం అవుతుందని వాళ్లు అస్సలు ఊహించి ఉండరు. అర్ధరాత్రి సమయంలో క్రూజర్ నడుపుతున్న డ్రైవర్‌కు (Driver) ఒక్కసారిగా నిద్రమత్తు రావడంతో వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఆ వాహనం అదుపుతప్పి నేరుగా రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, మృతుల గుర్తింపు కోసం పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నట్లు అదనపు జిల్లా కలెక్టర్ రాజేష్ జోషి వెల్లడించారు.
Also Read
- Koti Deepotsavam 2026 Day 9: కోటి దీప యజ్ఞంలో నేడు మరో విశేష ఘట్టం.. కంచి కామాక్షి మహాభిషేకం, మీనాక్షి కల్యాణం!
- KavyaAnirudh Reception: ఒకే వేదికపై రాజకీయ ప్రత్యర్థులు.. సీఎం విజయ్, మాజీ సీఎంలు స్టాలిన్, పళనిస్వామి
- IND A vs PAK A: నేడు ఆసియా కప్‌లో దాయాదుల సమరం..! పాకిస్థాన్‌తో భారత్ కీలక పోరు..
- India vs Pakistan: బ్లైండ్ క్రికెట్ ఆసియా కప్ ఫైనల్లో రచ్చ.. పాక్ ఆటగాళ్లతో కలిసి అంపైర్ 'జెట్ క్రాష్' సంబరాలు
ఇక అదే రాత్రి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో (Jodhpur) మరో ఘోర ప్రమాదం జరిగింది. గుజరాత్ (Gujarat) నుంచి రామ్‌దేవ్రా (Ramdevra) పుణ్యక్షేత్రానికి వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన వారు ప్రయాణిస్తున్న కారు, ఒక ట్రావెల్ టెంపో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారందరినీ జోధ్‌పూర్‌లోని మథురదాస్ మాథుర్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ఒకే రాత్రి జరిగిన ఈ రెండు దుర్ఘటనలు రెండు రాష్ట్రాల్లోని ఆయా కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చాయి.
తాజావార్తలు
-
Road Accidents: దేవుడి దర్శనం కోసం వెళ్లి మృత్యుఒడిలోకి.. ఒకే రాత్రి 12 మంది మృతి, 21 మందికి గాయాలు
-
School Reunion Turns Tragic: స్కూల్ రీయూనియన్‌లో పరిచయం.. ప్రేమ, అనుమానం, అసూయతో డబుల్ మర్డర్..!
-
Koti Deepotsavam 2026 Day 9: కోటి దీప యజ్ఞంలో నేడు మరో విశేష ఘట్టం.. కంచి కామాక్షి మహాభిషేకం, మీనాక్షి కల్యాణం!
-
KavyaAnirudh Reception: ఒకే వేదికపై రాజకీయ ప్రత్యర్థులు.. సీఎం విజయ్, మాజీ సీఎంలు స్టాలిన్, పళనిస్వామి
-
IND A vs PAK A: నేడు ఆసియా కప్‌లో దాయాదుల సమరం..! పాకిస్థాన్‌తో భారత్ కీలక పోరు..
ట్రెండింగ్
-
IND vs NZ Test: టీమిండియా బ్యాటర్ల ఊచకోత.. భారీ ఆధిక్యంలో భారత్..!
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!