Rajasthan Royals: ఒక్కో సిక్సర్.. ఆరు ఇళ్లకు సౌర విద్యుత్! రాజస్థాన్ రాయల్స్ సూపర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Why RR Wearing Pink Jersey in IPL 2024 Match vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో భాగంగా శనివారం జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లు పూర్తిగా గులాబీ రంగు జెర్సీలతో బరిలోకి దిగారు. ఆర్ఆర్ ప్లేయర్స్ పూర్తిగా గులాబీ రంగు జెర్సీలతో ఆడడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. రాజస్థాన్ మహిళల సాధికారత కోసం ఆ ఫ్రాంఛైజీ కృషి చేస్తోంది. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న మహిళలకు రాజస్తాన్ రాయల్స్ ప్రాంచైజీ మద్దతుగా నిలుస్తోంది.
‘పింక్ ప్రామిస్’ పేరుతో రాజస్తాన్ రాయల్స్ ప్రాంచైజీ వేర్వేరు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నీరు, సోలార్ విద్యుత్ అందించడంతో పాటు మహిళల మానసిక ఆరోగ్యం విషయంలో అండగా నిలుస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో నమోదైన ఒక్కో సిక్సర్‌కు.. ఆరు ఇళ్లకు సౌర విద్యుత్ అందిస్తామని రాజస్థాన్ ప్రాంచైజీ ప్రకటించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 13 సిక్సర్లు నమోదయ్యాయి. అంటే.. 78 ఇళ్లకు సౌర విద్యుత్ అందించనుంది. అలాగే ప్లేయర్స్ ధరించిన గులాబీ జెర్సీల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బు, మ్యాచ్‌కు అమ్ముడైన ఒక్కో టికెట్ నుంచి రూ.100 చొప్పున విరాళంగా ఇవ్వనుంది.
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
Also Read: Virat Kohli-IPL: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభానికి చాలా ముందు మార్చి 12న శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర, రాజస్థాన్ క్రీడా మంత్రి కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌లు ‘పింక్ ప్రామిస్’ కార్యక్రమంను ప్రారంభించారు. రాజస్తాన్ రాయల్స్ ప్రాంచైజీ చేస్తోన్న ఈ కార్యక్రమంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక ఐపీఎల్ 2024లో భాగంగా ఆడిన నాలుగు మ్యాచ్‌లలో రాజస్తాన్ గెలిచింది. ప్రస్తుతం 8 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
తాజావార్తలు
-
RAM 23 : రామ్ పోతినేని సినిమా టైటిల్ ఇదే.. మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందా?
-
Ramayana: ‘టాక్సిక్’ తర్వాత మరో భారీ పందెం.. ‘రామాయణం’పై దిల్ రాజు కన్ను? రూ.105 కోట్ల డీల్!
-
Akkineni Nagarjuna : 29న నాగార్జున ‘కింగ్ 100’ క్రేజీ గ్లింప్స్ బ్లాస్ట్.. అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ అప్డేట్
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!