Tempo Traveller Crash: కర్నూల్ బస్సు ప్రమాదం మరవ ముందే మరో ఘోరం వెలుగు చూసింది. రాజస్థాన్‌లోని ఫలోడి జిల్లాలోని మటోడా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని భరత్‌మాల ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం సాయంత్రం ఒక విషాదకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. జోధ్‌పూర్‌లోని సుర్‌సాగర్‌కు చెందిన 18 మంది టెంపో ట్రావెలర్‌లో కొలాయత్‌కు ఆలయ సందర్శన నుంచి తిరిగి వస్తుండగా హనుమాన్ సాగర్ కూడలి సమీపంలో ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాదంలో పదిహేను మంది అక్కడికక్కడే మరణించారు.
READ ALSO: JD Vance divorce: అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ – ఉషకు విడాకులు ఇస్తాడా? వైరల్‌గా మారిన పోస్ట్!
ఫలోడి పోలీసు సూపరింటెండెంట్ కుందన్ కన్వారియా మృతుల సంఖ్యను ధృవీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఈ ప్రమాదంలో పదిహేను మంది అక్కడికక్కడే మరణించారు. గాయపడిన ముగ్గురిని వెంటనే ఒసియన్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వారిని అక్కడి నుంచి గ్రీన్ కారిడార్ ద్వారా జోధ్‌పూర్‌కు తరలించారు. ప్రమాద తీవ్రతకు టెంపో ట్రావెలర్ పూర్తిగా ఛిన్నాభిన్నమైందని ఫలోడి డీఎస్పీ అచల్ సింగ్ దేవ్డా పేర్కొన్నారు.
ఫలోడి పోలీస్ స్టేషన్ అధికారి అమనారామ్ మాట్లాడుతూ.. ప్రమాదం అనంతరం టెంపో ట్రావెలర్‌లో చాలా మృతదేహాలు తీవ్రంగా ఇరుక్కుపోయాయి. వాటిని తొలగించడానికి పోలీసులు, స్థానికులు చాలా కష్టపడాల్సి వచ్చింది. మరణించిన, గాయపడిన వారందరూ జోధ్‌పూర్‌లోని సుర్‌సాగర్ ప్రాంత నివాసితులని చెప్పారు. వారు కొలాయత్‌ను సందర్శించిన తర్వాత వారి కుటుంబాలతో తిరిగి వస్తున్నారని పేర్కొన్నారు. పోలీసులు, ఎస్‌డిఆర్‌ఎఫ్, సహాయ బృందాలు సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న జోధ్‌పూర్ పోలీస్ కమిషనర్ ఓం ప్రకాష్ మాథుర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. భారతమాల ఎక్స్‌ప్రెస్‌వేపై టెంపో ట్రావెలర్ అతి వేగం ప్రమాదానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
READ ALSO: Iran Nuclear Program: ట్రంప్‌కు ఇరాన్ షాక్ .. ‘అణు కర్మాగారాలను పునర్నిర్మిస్తాం’