రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి ప్రేమ్‌చంద్ బైర్వా కుమారుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బైర్వా కొడుకు రీలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. వారి వెనుకాల పోలీసుల ఎస్కార్ట్ వాహనాలు వస్తున్నాయి. వీడియోలో ఓపెన్ జీపులో నలుగురు యువకులు కూర్చుని ఉన్నారు. కారులో కూర్చున్న యువకుల్లో ఒకరు డిప్యూటీ సీఎం ప్రేమ్‌చంద్ బైర్వా కుమారుడు ఉన్నాడు. ఓపెన్ జీపులో జైపూర్ వీధుల్లో తిరుగుతూ.. ట్రాఫిక్ రూల్స్ పాటించలేదు. ఉపముఖ్యమంత్రి ప్రేమ్‌చంద్ బైర్వాకు ఎస్‌కార్ట్ చేస్తున్న వాహనం రవాణా శాఖ పేరుతో రిజిస్టర్ అయి ఉందని విచారణలో తేలింది. రవాణా శాఖ ఉప ముఖ్యమంత్రి ప్రేమ్‌చంద్ బైర్వా పరిధిలోకి వస్తుంది. ఈ క్రమంలో.. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Amit Shah: ఎంఎస్‌పి పూర్తి పేరు తెలుసా..? రాహుల్ గాంధీ టార్గెట్‌గా విమర్శలు
కాగా.. వైరల్ అవుతున్న వీడియోపై డిప్యూటీ సీఎం డాక్టర్ ప్రేమ్‌చంద్ బైర్వా స్టేట్‌మెంట్ ఇచ్చారు. “నాలాంటి వ్యక్తిని రాజస్థాన్‌కు ఉప ముఖ్యమంత్రిని చేసినందుకు నేను ప్రధానికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. సంపన్న వ్యక్తులు నా కొడుకును వారితో కూర్చోబెట్టి, అతనికి విలాసవంతమైన కార్లు చూసే అవకాశం ఇస్తే, నేను కృతజ్ఞుడను” అని అన్నారు. తన కుమారుడికి ఇంకా 18 ఏళ్లు నిండలేదని, వారితో పాటు వాహనం భద్రత నిమిత్తం వచ్చినదని బైర్వా చెప్పారు. ఈ వ్యవహారంపై మాజీ రవాణా శాఖ మంత్రి ప్రతాప్‌సింగ్ ఖాచరియావాస్ స్పందిస్తూ.. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉందని వ్యంగ్యస్త్రాలు సంధించారు.
Read Also: Maldives president: అక్టోబర్‌లో భారత్‌లో ముయిజ్జు పర్యటన.. ప్రధాని మోడీతో చర్చలు