రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి ప్రేమ్‌చంద్ బైర్వా కుమారుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బైర్వా కొడుకు రీలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. వారి వెనుకాల పోలీసుల ఎస్కార్ట్ వాహనాలు వస్తున్నాయి. వీడియోలో ఓపెన్ జీపులో నలుగురు యువకులు కూర్చుని ఉన్నారు. కారులో కూర్చున్న యువకుల్లో ఒకరు డిప్యూటీ సీఎం ప్రేమ్‌చంద్ బైర్వా కుమారుడు ఉన్నాడు.