NTV Telugu Site icon

Raja Singh: మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్.. ఏమన్నారంటే?

Rajasingh

Rajasingh

మసీదులో ఆలయానికి సంబంధించిన ఆధారాలు దొరికితే అక్కడ గొప్ప ఆలయాన్ని నిర్మిస్తామని బీజేపీ ఎమ్మెల్యే టి.రాజా సింగ్ మరోసారి వివాదాస్పద ప్రకటన చేశారు. దీనితో పాటు.. 2029 నాటికి భారతదేశం హిందూ దేశంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర్ ఆలయానికి రాజా సింగ్ చేరుకున్నారు. మహాకాళ్ దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో నెలకొన్న మతపరమైన సంక్షోభాన్ని బాబా మహాకాళ్ ఆశీస్సులతో ఎదుర్కోవాలని ఆకాంక్షించారు. భారతదేశం హిందూ దేశంగా అవతరించే దిశలో తన విశ్వాసం దృఢంగా ఉందని, ఇది 2029 నాటికి నెరవేరుతుందని ఆయన అన్నారు.

READ MORE: YS Jagan: అదానీ వ్యవహారంపై జగన్‌ సంచలన వ్యాఖ్యలు.. వారిపై పరువునష్టం దావా..!

దేశంలో లవ్ జిహాద్ పెరిగిపోతోంది..
దేశంలో పెరుగుతున్న ‘లవ్ జిహాద్’, గోహత్యపై టి రాజా సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం లవ్ జిహాద్ పెరిగిపోవడంతో పాటు ఆవు మాంసం ఎగుమతి అవుతున్నదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని కొనియాడుతూ.. నరేంద్ర మోడీ లాంటి ప్రధాని భవిష్యత్తులో దొరకరని అన్నారు. మోడీ ఆరోగ్యం బాగుండాలని, భారతదేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని బాబా మహకల్‌ ని ప్రార్థించినట్లు తెలిపారు.

READ MORE: YS Jagan: ఏపీ చరిత్రలో నిలిచిపోయే ఘట్టం అది.. నేను మంచోడినా..? చంద్రబాబు మంచోడా..?

‘హిందూ రాష్ట్రం’ అంశంపై బీజేపీ ఎమ్మెల్యే తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు. భారతదేశం ఎప్పటికీ హిందూ దేశంగా మారదని నమ్మే వారు తమ అపోహను తొలగించుకోవాలని అన్నారు. రామమందిర నిర్మాణం, కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని తొలగించడాన్ని ఉదాహరిస్తూ.. గతంలో రామమందిరం కట్టబోమని చెప్పారని, నేడు ఈ ఆలయాన్ని నిర్మించారని అన్నారు. 2029 నాటికి భారతదేశం హిందూ దేశంగా మారుతుందని, గోహత్యను కూడా నిషేధిస్తామని రాజా సింగ్ పేర్కొన్నారు. మత స్థలాల సర్వేను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అయితే సర్వేలో మసీదు కింద గుడి ఉన్నట్లు ఆధారాలు దొరికితే అక్కడ గొప్ప ఆలయాన్ని నిర్మిస్తామన్నారు.

Show comments