Raja Singh: కేసీఆర్ లా రేవంత్ రెడ్డి సడెన్గా మారొద్దని విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు పెట్టుకుంటే రాష్ట్ర అబివృద్ధి కొరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ డబ్బులు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు అని గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. గత పదేళ్ళలో తెలంగాణ రాష్ట్రానికి మోడీ ఇచ్చిన డబ్బుల లెక్కను సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు చెప్పాలి అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక, కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో గత ప్రభుత్వం చేసిన అవినీతిని బయట పెట్టాలని రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తున్నాను అని ఆయన కోరారు. అదిలాబాద్ సభలో సీఎం రేవంత్ ప్రధాని మోడినీ పెద్దన్న అని సంబోధిస్తునే.. రాష్ట్ర అభివృద్దికి సహకారం అందించాలని అడిగారు అనే విషయాన్ని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.
Read Also: BRS: బీఆర్ఎస్ పార్టీకి షాక్.. కేసీఆర్ మీటింగ్ కు ఖమ్మం ఎమ్మెల్యే డుమ్మా..
Also Read
ఇక, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చింది.. ఈ 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది అనేది చూసుకోవాలి అని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు మొదట్లో కేసీఆర్ మోడినీ పొగడ్తలతో ముంచెత్తారు.. కానీ, ఆ తర్వాత కేసీఆర్ మారిపోయి.. కనీసం మోడీ టూర్స్ లో ప్రోటోకాల్ కూడా పాటించలేదు అని విమర్శలు గుప్పించారు. అయితే, కేసీఆర్ లాగా సీఎం రేవంత్ రెడ్డి సడెన్గా మారొద్దని గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!