Rajasekhar: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరో రాజశేఖర్ ‘గోటీల ఫ్యాక్టరీ’ అంటూ వీడియోలు వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఎవరు పుట్టించారో, ఎలా పుట్టించారో తెలియదు కానీ.. హీరో రాజశేఖర్‌కి సినిమాలు కాకుండా గోటీల ఫ్యాక్టరీ బిజినెస్ కూడా ఉందని సోషల్ మీడియాలో ఒక పుకారు పుట్టించారు. అది బాగా వైరల్ అయింది.
తాజాగా ‘బైకర్’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న హీరో రాజశేఖర్ ఈ విషయం మీద స్పందించారు. తనకు ఈ గోటీల ఫ్యాక్టరీ లాంటిది ఏమీ లేదని ఆయన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ వీడియోలన్నీ చూసి తనకు బాగా తెలిసిన వాళ్ళు కూడా ఫోన్ చేసి, “నిజంగానే గోటీల ఫ్యాక్టరీ లాంటివి ఏమైనా ఉన్నాయా?” అని ఆరా తీసినట్లు ఆయన వెల్లడించారు.
READ ALSO: Kayadu Lohar: కాయదు కమిటెడా? నమ్మలేని కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ!
రాజశేఖర్ ‘బైకర్’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ఏప్రిల్ మూడో తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాని అభిలాష్ రెడ్డి కంకర డైరెక్ట్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ఇక ఈ సినిమా రిలీజ్ ముందే టేబుల్ ప్రాఫిట్స్ వచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. శర్వానంద్ చివరి సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’ డీసెంట్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో, అది ఈ ‘బైకర్’ సినిమాకి కూడా కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ సినిమా ప్రమోషన్స్‌లో రాజశేఖర్ బిజీ బిజీగా ఉన్నారు.
READ ALSO: Pakistan: పాకిస్థాన్ సైనిక స్థావరంపై ఆఫ్ఘన్ మెరుపు దాడి!
