రాజమౌళి ఎస్ఎస్ఎంబీ29 షూట్ చేస్తున్నారా ఇది ప్రజెంట్ మూవీ లవర్స్ క్వశ్చన్. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ గురించి అప్డేట్ తప్పితే మూవీ థియేటర్లలోనూ, స్పెషల్ ఈవెంట్స్‌లో సందడి చేస్తున్నారు దర్శక ధీరుడు. రీసెంట్లీ ఇండియా టెస్ట్ క్రికెట్ మ్యాచ్ విన్ అయిన సందర్భంగా టీమ్ ఇండియాను పొగుడుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం ఆలస్యం.. వేర్ ఈజ్ అప్డేట్ అంటూ ఎస్ఎస్ఎంబీ29 గురించి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
Also Read : Betting App Case : ఈడీ ఎదుట హజరైన విజయ్ దేవరకొండ.. టైంపాస్ క్వశ్చన్స్ అడగొద్దు
‘రాజమౌళి సినిమాలు, క్రికెట్ వాచ్ చేస్తూ మీరు బిజీ. ఓ వైపు బాహుబలి ఎపిక్ అంటారు. మరో వైపు స్పెషల్ ఈవెంట్లో సందడి చేస్తారు. మహేశ్ బాబు ఫ్యామిలీ ఫంక్షన్లకు అటెండ్ అవుతున్నారు. ప్రియాంక భర్తతో కలిసి హాలీడే ట్రిప్స్ ఎంజాయ్ చేస్తుంది. మహి ఫ్యాన్స్ ఏమో అతడు రీ రిలీజ్ హడావుడిలో ఉన్నారు. అసలు ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ జరుగుతుందా లేదా అంటూ క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఇంకొందరైతే ఏకంగా దర్శకధీరుడితో గొడవపడినట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. మహితో సినిమా అనే మాట తప్ప ఎక్కడా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు దర్శక ధీరుడు. పోనీ బర్త్ డేకు ట్రీట్ ఉంటుందా అంటే చెప్పలేని సిచ్యుయేషన్. దీంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ కూడా గుర్రుగా ఉన్నారు. బడ్జెట్, స్టోరీతో ఫుల్ శాడిస్పై ఉన్నారు కానీ అప్డేట్స్ లేక అల్లాడిపోతున్నారు. మహేశ్ బాబు బర్త్ డే వస్తుందీ అప్డేట్ మా మొహన పడేయ్ అంటున్నారు. వీళ్లు అడిగారు వాళ్లు అడిగారు హీరో బర్త్ డేలు, ఇతర అకేషన్లతో సంబంధాలు ఉండవ్ రాజమౌళికి ఆయన ఇచ్చినప్పుడు మాత్రమే మూవీ లవర్స్ కానీ, ఆయా హీరోలు ఫ్యాన్స్ కానీ పుచ్చుకోవాల్సిందే. అప్పటి వరకు ఎదురుచూపులు తప్పవు.
