Site icon NTV Telugu

MLA Raja Singh: టీడీపీ నుంచి బీజేపీకి.. రాజా సింగ్ రాజకీయ ప్రస్థానంపై ఓ లుక్కేయండి..

Mla Raja Singh

Mla Raja Singh

గోషామహల్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రాంచందర్ రావు నియామకం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి తన రాజీనామా పత్రాన్ని అందించారు. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం రాజాసింగ్ హాట్ టాపిక్‌గా మారారు. అయితే.. హిందుత్వ భావజాలం కలిగిన ఆయన రాజకీయ ప్రస్థానం ఆసక్తికరంగా ఉంది. అందేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

READ MORE: All-Time XI: టీ20 ఆల్‌టైమ్ ప్లేయింగ్‌ ఎలెవన్‌.. రోహిత్, కోహ్లీకి నో ప్లేస్!

వాస్తవానికి.. రాజా సింగ్ గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు 2009లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో మంగ‌ళ‌హాట్ డివిజ‌న్ నుంచి తెలుగుదేశం పార్టీ కార్పొరేట‌ర్‌గా గెలుపొందారు. అప్పుడు బీజేపీని సీట్ ఇవ్వమని కోరగా.. పార్టీ ఇవ్వలేదని ఇటీవల ఆయన వెల్లడించారు. దీంతో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచినట్లు చెప్పారు. అలా టీడీపీతో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. టీడీపీ కార్పొరేటర్‌గా ఉన్న స‌మ‌యంలోనే మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొంటూ యువతను తనవైపునకు మ‌లుచుకోవ‌డంలో ఆయ‌న విజ‌య‌వంత‌మ‌య్యారు. 2010 నుంచి ప్రతి సంవ‌త్సరం శ్రీరామ్‌ శోభాయాత్రలు నిర్వహిస్తున్నారు. క్రమేణా ఈ యాత్ర నగరంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరించడంతో ఆయ‌న‌ పేరు మార్మోగిపోయింది.

READ MORE: Tollywood : 9 హిట్లు.. 2025 హాఫ్‌ ఇయర్ విన్నర్ ఆ హీరోనే..!

ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత అప్పర్‌ ధూల్‌పేటలోని గంగాబౌలీలో 150 అడుగుల ఎత్తయిన కొండపై 51 అడుగుల ఎత్తయిన ఆంజనేయస్వామి విగ్రహాన్ని రాజాసింగ్ ఏర్పాటు చేశారు. దానికి ఆకాశపురి హనుమాన్‌ దేవాలయం అని పేరు పెట్టారు. అక్కడే గోశాలను ఏర్పాటు చేయడంతోపాటు ఎక్కడతై గోవులను తరలిస్తున్నారనే సమాచారం అందుతుందో వెంటనే అక్కడకు చేరుకొని ఆ తరలింపును అడ్డుకునేవారు. ఆ సందర్భాల్లోను ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోను గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న ఎమ్మెల్యేగా బాగా పేరు తెచ్చుకున్నారు.

READ MORE: Beerla Ilaiah: కేసీఆర్ సూచనల మేరకే బీజేపీ అధ్యక్ష ఎంపిక.. ప్రభుత్వ విప్ సంచలన వ్యాఖ్యలు..!

హిందుత్వ భావజాలం కలిగిన బీజేపీలో చేరాలని రాజాసింగ్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో 2014లో శాసన సభ ఎన్నికలు వచ్చాయి. 2014లో ఆయనకు బీజేపీ సీటు ఇచ్చింది. దీంతో ఆ ఎన్నిక‌ల్లో గోషామ‌హ‌ల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ముఖేశ్‌గౌడ్‌పై 50వేల ఓట్లకు పైగా మెజార్టీతో ఘ‌న‌ విజయం సాధించారు. 2018 ఎన్నిక‌ల్లో కూడా విజ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేశారు. ఆ ఎన్నిక‌ల్లో తెలంగాణ మొత్తం మీద గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రాజాసింగ్ రికార్డు సృష్టించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజాసింగ్ పార్టీలో చురుకుగానే వ్యవహరించారు. సంజయ్ పగ్గాలు కోల్పోవడంతో రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే వచ్చారు. పలు మార్లు పార్టీ నుంచి సస్పెండ్ కూడా అయ్యారు. రాజాసింగ్ తరచూ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడుతూ వ్యాఖ్యలు చేస్తుండంటతో ఆయనపై బీజేపీ పలుమార్లు చర్యలు తీసుకుంది.

READ MORE: Beerla Ilaiah: కేసీఆర్ సూచనల మేరకే బీజేపీ అధ్యక్ష ఎంపిక.. ప్రభుత్వ విప్ సంచలన వ్యాఖ్యలు..!

పార్టీలో తనకు అన్యాయం జరుగుతోందని తరచూ ఆక్రోశించే రాజాసింగ్‌కి పార్టీని విమర్శించడానికి ఏదో ఒక సందర్భం దొరుకుతూనే ఉంటుంది. ఇటీవల బీజేపీలో బీఆర్ఎస్‌ విలీన ప్రయత్నాలు జరిగాయని కవిత చేసిన వ్యాఖ్యలు నిజమేనంటూ బాంబు పేల్చారు. పెద్ద ప్యాకేజీ వస్తే బీజేపీ నేతలు బీఆర్ఎస్‌తో కలిసిపోతారని, ప్రతి ఎన్నికల్లోనూ మా నేతలు బీఆర్ఎస్‌తో కుమ్మక్కయ్యారని ఆయన చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారాయి. ఇటీవల రాజాసింగ్ అధ్యక్ష పదవిని సైతం ఆశించారు. తనకు ఎలాదో పదవి వరించదని.. అయినా ప్రయత్నం చేయడంలో తప్పు లేదన్నారు. తాజాగా ఆయన రాజీనామాపై చాలా మంది బీజేపీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు.

Exit mobile version