Raja Singh:బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ విషయంలో తెలంగాణ బీజేపీ పార్టీ కీలక ప్రకటన చేసింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ క్రమశిక్షణారాహిత్యం పరాకాష్ఠకు చేరిందని, రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎన్నికలలో రాజాసింగ్ కూడా నామినేషన్ వేస్తానని పార్టీ కార్యాలయానికి వచ్చారని తెలిపింది. ఆ సమయంలో విషయమై జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ అభయ్ పాటిల్ రాజాసింగ్ చర్చించారు. ఇక రాజాసింగ్ కోరిక మేరకు నామినేషన్ పత్రాలు ఇచ్చి నామినేషన్ వేసుకునే అవకాశం ఇచ్చారని…
గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రాంచందర్ రావు నియామకం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి తన రాజీనామా పత్రాన్ని అందించారు. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం రాజాసింగ్ హాట్ టాపిక్‌గా మారారు. అయితే.. హిందుత్వ భావజాలం కలిగిన ఆయన రాజకీయ ప్రస్థానం ఆసక్తికరంగా ఉంది. అందేంటో ఇప్పుడు తెలుసుకుందాం..