Raja Singh Encounter: తనను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్‌కౌంటర్ చేయాలని ప్లాన్ చేసినట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నాడు జరిగిన సంచలన విషయాలను వివరించారు. తాను హిందువాహినిలో చేరి యువతను ధర్మం వైపు ఆకర్శితులయ్యేలా కార్యక్రమాలు చేపట్టానని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో తమ కార్యక్రమాలకు ఎప్పుడూ ఏదో ఒక గొడవ సృష్టించేవారని, తాము ఎక్కడికి వెళితే అక్కడ 144 సెక్షన్ అమలు చేసేవారని రాజాసింగ్ తెలిపారు. ఎవరైనా హిందువులను మతం మార్చాలని ప్రయత్నిస్తే తాము అడ్డుకునే వాళ్లమన్నారు. మా వల్ల ఏదో ఒక గొడవ జరుగుతోందని అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ కుట్రలు చేసింది. లేనిపోని కేసులు పెట్టి జైలుకు పంపారు. అప్పుడు కూడా ఆగలేదు. జైలుకు వెళ్లాం బయటకు వచ్చాం. మళ్లీ ధర్మం కోసం కార్యక్రమాలు చేశామని తెలిపారు. ఇలా ఎన్‌కౌంటర్ మిస్టరీని కూడా బయటపెట్టారు.
READ MORE: Vivo X200 FE vs Oppo Reno 14 Pro: ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? వివో, ఒప్పోలో ఏది బెస్ట్!
కాంగ్రెస్ హయాంలో మమ్మల్ని ఎన్‌కౌంటర్ చేయాలని ప్లాన్ చేశారని రాజాసింగ్ తెలిపారు. “నన్ను, నాతో పాటు ఓ హిందూవాహిని కార్యకర్తను అడివిలోకి తీసుకెళ్లారు. ఎన్‌కౌంటర్ చేయడానికి ప్లాన్ చేశారు. నన్ను ఎన్‌కౌంటర్ చేయబోయే పోలీస్ కట్టర్ హిందు. నా గురించి ఆయనకు తెలియదు. ఉన్నతాధికారులు నన్ను ఎన్‌కౌంటర్ మాత్రమే చేయాలని ఆయనకు చెప్పారు. నా గురించి ఆ పోలీసు అధికారికి తెలియదు. ఆ పోలీసు నన్ను అడవిలోకి తీసుకెళ్లి జీపు నుంచి కిందికి దింపారు. పరిగెత్తామని చెప్పాడు. ఆయన తన గన్ లోడ్ చేసుకుంటున్నాడు. అప్పుడే నాకు అర్థం అయ్యింది నన్ను ఎన్‌కౌంటర్ చేస్తారని.. “ఉరకడం ఎందుకు సార్.. ఇక్కడే కాల్చేయండి.” అని నేను ఆ పోలీసు అధికారికి చెప్పాను. ధర్మం కోసం చావాలనే మా కల ఇక్కడే చంపేయండి అని చెప్పాను. దీంతో ఆ పోలీసు అధికారి ఆలోచనలో పడ్డారు. వీళ్లు ధర్మం గురించి మాట్లాడుతున్నారేంటి? అని ఆలోచించారు. ఇంతకు మీరు ఎవరు? అని ఆ ఆఫీసర్ అప్పుడు మమ్మల్ని అడిగారు. దాదాపు రెండు గంటల పాటు మా చరిత్ర ఆయనకు చెప్పాం. మిమ్మల్ని చంపి ఉంటే పెద్ద పాపం అయి ఉండేది అని ఆ పోలీస్ ఫీల్ అయ్యారు. దీంతో కొన్ని ఛానెల్స్‌కి ఆ పోలీసే స్వయంగా “రాజాసింగ్‌ను ఎన్‌కౌంటర్ చేయబోతున్నారు.” అని మీడియాకు లీక్ చేశారు. దీంతో టీవీల్లో ఈ వార్త వచ్చింది. దీంతో నన్ను ఎవరైతే ఎన్‌కౌంటర్ చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారో వాళ్లే ఆపేయాలని ఈ అధికారికి ఫోన్ చేశారు. అలా ఎన్‌కౌంటర్ నుంచి బయట పడ్డామని రాజాసింగ్ సంచలన విషయాలు బయటపెట్టారు.
