పాడైన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని రిపైర్ చేసి మళ్ళీ మళ్ళీ పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఇప్పుడు కూడా వాహనంలో సౌండ్స్ వస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. రాజా సింగ్ బతుకుతే ఎందీ? చస్తే ఏంది? అనే ఫీలింగ్ లో కేసిఆర్ ఉన్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ప్రాణహాని లేని ఎమ్మెల్యే లకు కొత్త కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇచ్చారని, నాకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం వద్దని అధికారులకు ఇదివరకే లేఖ రాశానన్నారు. అయినా అదే వాహనాన్ని బాగు చేసి నాకు తిరిగి పంపించారని ఆయన పేర్కొన్నారు. మీకు ప్రాణహాని ఉంది కాబట్టి బుల్లెట్ ప్రూఫ్ వాహనం వెహికిల్ ఇచ్చామని అధికారులు అంటున్నారని, మీరు దానిలోనే తిరగాలని పోలీసులు నోటీసులు ఇస్తున్నారన్నారు.
Also Read : Shardul Thakur: వరల్డ్‌కప్ జట్టులో శార్దూల్‌కి చోటు.. అంతలేదన్న మాజీ క్రికెటర్
తిరగకపోతే కూడా నోటీసులు ఇస్తున్నారని, తిరిగితే బండి ఎప్పుడు పాడు అవుతుందో అర్థం కావట్లేదని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి ఇదే వెహికిల్ పంపించమని చెబుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఈ వాహనం ఐదు సార్లు నడిరోడ్డుపై నిచిలిపోగా.. ఇటీవల శంషాబాద్ నుంచి వస్తుండగా పురాణాపూల్ సర్కిల్లో ఆగిపోయింది. తరచుగా తన వాహనం రోడ్డుపై ఆగిపోతోందని ఎమ్మెల్యే రాజా సింగ్ చెబతున్నారు.
Also Read : Mla KethiReddy Padayatra: ఎమ్మెల్యే పెద్దారెడ్డి పాదయాత్ర.. హారతులిచ్చిన జనం