Raja Shivaji First Poster: ఛత్రపతి శివాజీ మహారాజ్ మూవీ “రాజా శివాజీ”.. గూస్ బంప్స్ తెప్పించే ఫస్ట్ లుక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raja Shivaji First Poster: గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడ చూసినా ఒక పేరు మారుమోగుతోంది. ఆ పేరు వింటేనే యువకుల రక్తం మరుగుతోంది. ఆయన ఎవరో కాదు.. శ్రీ శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్. భారత చరిత్రలో మహా వీరుడైన ఛత్రపతి శివాజీ మహారాజు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న భారీ చిత్రంగా “రాజా శివాజీ” ఇప్పటికే దేశమంతా ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రంలో రితేశ్ దేశ్‌ముఖ్ శివాజీగా కనిపించబోతున్నాడు. అయితే.. నేడు శివాజీ జయంతి సందర్భంగా రితేశ్ దేశ్‌ముఖ్ తొలి పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మొదటి పోస్టరే అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పోస్టర్లో ఆయన రాజసంగా, ధైర్యంగా నిలిచిన తీరు చూసినవారికి గర్వంగా అనిపించేలా ఉంది. ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని మరింత భావోద్వేగంగా మార్చింది జెనీలియా దేశ్‌ముఖ్. ఆమె తన మనసులోని గౌరవాన్ని వ్యక్తం చేస్తూ శివాజీ మహారాజు గురించి ఎంతో ప్రేమతో ఒక సందేశం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. స్వరాజ్యం కోసం ఒక యువ యోధుడు చేసిన ప్రతిజ్ఞ ఎలా చరిత్రను మార్చిందో ఈ పోస్ట్‌లో స్పష్టంగా కనిపించింది. “మన రాజు.. మన గర్వం.. మన వారసత్వం” అనే భావం ఆ సందేశం ఉంది. ఈ సినిమా ఇప్పటివరకు చూడని స్థాయిలో ఉంటుందని ఆమె చెప్పడంతో ప్రేక్షకులకు మరింత ఆసక్తి పెరిగింది.
READ MORE: Emmanuel Macron: ‘‘రాఫెల్‌తో మీ దేశానికే లాభం, విమర్శలు ఎందుకు.?’’
Also Read
- Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్‌పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
- Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
- Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
- Virat Kohli: కెప్టెన్‌గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
అయితే.. ఈ సినిమా ఒకే భాషకు పరిమితం కావడం లేదు. మరాఠీ, హిందీతో పాటు దక్షిణ భారత భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మే 1న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం మహారాష్ట్ర దినోత్సవంతో కలిసివచ్చేలా ఉండటం ప్రత్యేకతగా చెప్పుకోవాలి. పోస్టర్ బయటకు వచ్చిన వెంటనే అభిమానుల స్పందన ఊహించని స్థాయిలో కనిపించింది. “ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాం”, “ఇది ఖచ్చితంగా భారీ విజయమే” అనే సందేశాలతో సామాజిక మాధ్యమాలు పోస్టులు నిండిపోయాయి. మరాఠీ చిత్రసీమకు ఇది కొత్త శకం తీసుకువస్తుందని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే.. ఈ చిత్రానికి రితేశ్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహించడం విశేషం. కథలో కనిపించే పాత్రల జాబితా సైతం ఎంతో ఆసక్తికరంగా ఉంది. సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, మహేష్ మంజ్రేకర్, ఫర్దీన్ ఖాన్, సచిన్ ఖేడేకర్, భాగ్యశ్రీ పాట్వర్ధన్, జితేంద్ర జోషి, సిద్ధార్థ్ శిండే, విద్యా బాలన్, అమోల్ గుప్తే వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
Our King. Our Pride. Our Legacy.#RajaShivaji
Chhatrapati Shivaji Maharaj @mfc @jiostudios pic.twitter.com/b82SzZFC8R
— Riteish Deshmukh (@Riteishd) February 19, 2026
తాజావార్తలు
-
Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్‌పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
-
Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
-
Virat Kohli: కెప్టెన్‌గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
-
CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!