ప్రార్థనల సమయంలో మసీదుల్లో లౌడ్‌స్పీకర్లు పెట్టడాన్ని మహారాష్ట్ర నవనిర్మాణసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఉద్యమం చేస్తోంది. అయితే తాము చేపట్టిన ఉద్యమంపై మహారాష్ట్ర నవనిర్మాణసేన అధినేత రాజ్‌థాకరే స్పష్టత ఇచ్చారు. తాము ముస్లింలు నిర్వహించుకునే ప్రార్థనలకు వ్యతిరేకం కాదన్నారు. కానీ ముస్లింలు ప్రార్థనలను లౌడ్ స్పీకర్లలో నిర్వహిస్తే అప్పుడు తాము కూడా లౌడ్ స్పీకర్లను వినియోగించాల్సి వస్తుందన్నారు. చట్టం కంటే మతం పెద్దది కాదన్న విషయాన్ని ముస్లింలు గుర్తించాలని రాజ్‌థాకరే హితవు పలికారు.
మసీదుల్లో లౌడ్‌స్పీకర్లను మే 3 నాటికి తొలగించాలని ఇప్పటికే రాజ్‌థాకరే అల్టీమేటం జారీ చేశారు. లేదంటే మసీదుల ముందు లౌడ్ స్పీకర్‌లలో హనుమాన్ చాలీసా పారాయణాలను వినిపిస్తామని ఆయన హెచ్చరించారు. మే 3 తర్వాత ఏం జరుగుతుందో వేచి చూస్తున్నట్లు రాజ్‌థాకరే తాజాగా స్పందించారు. అయితే మసీదుల్లో లౌడ్ స్పీకర్ల విషయంలో రాజ్‌థాకరే వైఖరిని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ వ్యతిరేకిస్తున్నారు. యూపీలో అసదుద్దీన్ చేస్తున్న పనినే మహారాష్ట్రలో రాజ్ థాకరే చేస్తున్నారంటూ విమర్శించారు. మహారాష్ట్రలో శాంతిని చెడగొట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కానీ ప్రజలు, పోలీసులు శాంతియుతంగా వ్యవహరిస్తున్నారని రౌత్ పేర్కొన్నారు. రామ్, హనుమాన్ పేరుతో థాకరే మరో ఒవైసీలా వ్యవహరిస్తున్నారని.. ఆయన ఓ హిందూ ఓవైసీ అంటూ సంజయ్ రౌత్ ఆరోపించారు.
Karnataka: హుబ్లీలో ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్‌పై అల్లరి మూకల దాడి