Rainy Season : అధిక వర్షాల నుంచి పండ్ల తోటలను ఎలా కాపాడాలి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి.. భారీ వర్షాల కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.. చేతికి వచ్చిన తోట వర్షాలకు నేల రాలుతున్నాయి.. ఇటీవల అల్పపీడనం కారణంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే..కొన్ని పంటలు నీళ్ళు వెళ్ళాక మళ్ళీ మామూలు స్థితికి వస్తాయి.కానీ,కొన్ని పంటలు మాత్రం పాడైపోతాయి.అందులో పండ్ల తోటలు ఎక్కువగా ఉంటాయి.. ఈ ఏడాది రైతులు ఎక్కువగా నష్ట పోయారు..
తెలంగాణాలో వర్షాలు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు.. ఎప్పుడు వర్షాలు కురుస్తాయో.. ఎప్పుడు నార్మల్ గా ఉంటుందో చెప్పడం కాస్త కష్టమే.. రాష్ట్ర వ్యాప్తంగా 4,24,287 ఎకరాలలో పండ్ల తోటలు సాగుచేయబడగా, పండ్ల ఉత్పత్తి 23,89,184.54 మెట్రిక్ టన్నులు సాధించడం జరిగింది. అయితే పండ్ల దిగుబడి తగ్గడానికి తోటలలో ఆశించే రకరకాల కీటకాలు, పురుగులు మరియు వివిధ రకాల తెగుళ్ళతో పాటు భారీ వర్షాలు మరియు అకాల వర్షాలు కూడా కారణమవుతున్నాయి. భారీ వర్షాలు వివిధ రకాల తోటలలో మొక్క యొక్క వివిధ దశలలో నష్టం కలుగజేసే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు పాటించినట్లయితే కొంత మేర నష్టాన్ని తగ్గించవచ్చు… అవేంటో ఒకసారి చూద్దాం..
Also Read
- India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
దానిమ్మలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. తోటలలో అధికంగా ఉన్న నీటిని తీసివేయాలి. మొదళ్ళ వద్ద నీటిని తిరగవేయాలి.చెట్టు మొదళ్ళను కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రా. / లేదా నీటికి కలిపిన ద్రావణంతో తడిపి వేర్లు తెగుళ్ళకు గురికాకుండా చూడాలి. బాక్టీరియా తెగుళ్ళు నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 30 గ్రా. / 10 లీటర్ల నీటికి మరియు స్ట్రెప్టోసైక్లిన్ 1 గ్రా. / 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి.ఎండిపోయిన మరియు తెగుళ్ళు సోకిన కొమ్మలను కత్తిరించి నాశనం చేయడం ద్వారా బాక్టీరియా తెగుళ్ళను నివారించ వచ్చును..
బొప్పాయలో జాగ్రత్తలు… ఈ పంటలో కూడా అంతే మొదటగా నీటిని బయటకు పంపించాలి.. ఆ తర్వాత మెటలాక్జిల్ ఎంజెడ్ 3 గ్రా. లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. / లీటరు నీటికి కలిపి మొదళ్ళ దగ్గర పోయాలి. సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని 5 గ్రా. / లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కోతకు తయారై ఉన్న కాయలను మార్కెట్ కు తరలించాలి.పండు కుళ్ళు నివారణకు హెక్సాకోనజోల్ 2 మి.లీ. లేదా డైఫెన్ కొనజోల్ 0.5 మి.లీ.0 0.5 మి.లీ. (స్టికర్) జిగురు మందును కలిపి పిచికారీ చేయాలి..ప్రతి పంటలో ముందుగా నీటిని బయటకు పంపించాలి… ఇలాగే జామ, అరటిలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొంతమేర నష్టాన్ని తగ్గించుకోవచ్చు..
తాజావార్తలు
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్
-
Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
-
PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!