CM Revanth Reddy : వర్షాలు.. ప్రాజెక్టులలో నీటి లభ్యతపై సీఎం రేవంత్ సమీక్ష
- ప్రాజెక్టులకు నీటి వరద నేపథ్యంలో ప్రాజెక్టుల నుండి నీటిని లిఫ్ట్ చేసే అంశంపై చర్చ
- రిజర్వాయర్లు నింపే ఆలోచనలో ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీ వర్షాలతో వచ్చిన వరద నీటిని వృథా చేయకుండా భవిష్యత్తు అవసరాల కు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు ల పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు కుంటల్లో నీటిని నిల్వ చేయాలని సూచించారు. ఎగువన కురిసిన వర్షాలతో పాటు కడెం నుంచి వస్తున్న వరద తో పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండింది. ఎల్లంపల్లి గేట్లు ఎత్తి నీటిని గోదావరి లోకి వదులుతున్నారు. మరోవైపు ఎల్లంపల్లి కి వచ్చిన వరద నీటిని వీలైనంత మేరకు లిఫ్ట్ చేయాలని, రోజుకు ఒక టీఎంసీ తగ్గకుండా డ్రా చేయాలని ఆదేశించారు. నంది, గాయత్రి పంప్ హౌస్ ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయర్లు నింపాలని ముఖ్యమంత్రి సూచించారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్‌తో పాటు రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్ వరకు జలాశయాల్లోకి ఏకధాటిగా నీటిని లిఫ్ట్ చేయాలని ఆదేశించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్ధ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.45 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కడెం ప్రాజెక్టు నుంచి ప్రవాహం ఉద్ధృతంగా వస్తుండటంతో నంది, గాయత్రి పంప్ హౌస్ ల ద్వారా మిడ్ మానేరుకు నీటిని తరలిస్తున్నారు.
Vande Bharat Sleeper: అదిరిపోయే “వందే భారత్ స్లీపర్ ట్రైన్” ఫీచర్లు.. మీరు ఓ లుక్కేయండి..
Also Read
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Mamata Banerjee: "ఇక మేమేంటో చూపిస్తాం".. అల్లుడు అభిషేక్‌పై దాడి అనంతరం దీదీ ఆడియో వైరల్..
- Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
మిడ్‌మానేరు ప్రాజెక్టు సామర్ధ్యం 27 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15 టీఎంసీలు ఉంది. అక్కడి నుంచి 14 వేల క్యూసెక్కుల కు పైగా లోయర్ మానేరు డ్యామ్‌కు, మరో 6400 క్యూసెక్కులు అన్నపూర్ణ రిజర్వాయర్ ద్వారా రంగనాయక్ సాగర్‌కు తరలిస్తున్నారు. అటు రంగ నాయక సాగర్ నుంచి నీటిని పంపింగ్ చేసి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నింపాలని.. అక్కడి నుంచి సింగూర్ ప్రాజెక్ట్, నిజాంసాగర్ ప్రాజెక్ట్ వరకు నీటిని తరలించాలని ఆదేశించారు. ప్రస్తుతం అన్నపూర్ణ, రంగ నాయక సాగర్ నుంచి 7.52 టీఎంసీ, మల్లన్నసాగర్ లో 50 టీఎంసీ ల కెపాసిటీ. ప్రస్తుతం 11.43 టీఎంసీ ల నిల్వ ఉంది. కొండ పోచమ్మ సాగర్ లో 15 టీఎంసీ ల కెపాసిటీ ఉండగా 7.91 టీఎంసీ నీళ్లున్నాయి. కేంద్ర జల సంఘం మార్గదర్శకాల ప్రకారం మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లలో సాధ్యమైనంత వరకు నీటిని నిల్వ చేయాలని చెప్పారు. మల్లన్నసాగర్ లో గరిష్ఠంగా 18 నుంచి 20 టీఎంసీ లు, కొండపోచమ్మ సాగర్ లో 10 టీఎంసీ లు నిల్వ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అన్ని ముందు జాగ్రత్తలు పాటించాలని అప్రమత్తం చేశారు.
కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలించాలని చెప్పారు.
Hyderabad-Vijayawada highway Closed: హైదరాబాద్- విజయవాడ మధ్య రాకపోకలు బంద్..
తాజావార్తలు
-
IRCTC Jyotirlinga Darshan Yatra: శివభక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్.. ఒకే టూర్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. పూర్తి వివరాలు ఇవే!
-
Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
-
Peddi Pre-Release Event : ‘పెద్ది’ ప్రీరిలీజ్ ఈవెంట్ కు అతిథిగా స్టార్ హీరో
-
Mamata Banerjee: “ఇక మేమేంటో చూపిస్తాం”.. అల్లుడు అభిషేక్‌పై దాడి అనంతరం దీదీ ఆడియో వైరల్..
-
LPG New Rules: LPG కస్టమర్లకు షాక్.. జూన్ 1 నుంచి మీ గ్యాస్ కనెక్షన్ రద్దు కావచ్చు! కేంద్రం కొత్త రూల్స్ ఇవే..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..