Pakistan vs New Zealand: పాకిస్థాన్ కొంప ముంచిన వర్షం.. న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు.. ఇక ఇదే లాస్ట్ ఛాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan vs New Zealand: వర్షం పాకిస్థాన్ కొంప ముంచింది. శనివారం శ్రీలంక రాజధాని కొలంబోలో జరగాల్సిన పాకిస్థాన్ vs న్యూజిలాండ్ టీ20 వరల్డ్ సూపర్ ఎయిట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే సైతం లేదు. దీంతో చేసేదేమి లేక రెండు జట్లకు ఒక్కో పాయింట్ ఇచ్చారు. వర్షం కారణంగా ఇరు దేశాలకు గడ్డు కాలంగా మారింది. సెమీఫైనల్ అవకాశాలు సన్నగిల్లాయి. పాకిస్థాన్ ఇప్పుడు ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇంగ్లాండ్, శ్రీలంకలతో పాక్ పోటీ పడాల్సి ఉంది. సల్మాన్ అలీ ఆఘా సారథ్యంలోని జట్టు ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే మొత్తం 5 పాయింట్లతో సెమీఫైనల్‌కు చేరే అవకాశాలు బలంగా ఉంటాయి. ఒకటి గెలిచి, ఒకటి ఓడితే 3 పాయింట్లతో ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. రెండు మ్యాచ్‌లూ ఓడిపోతే పాకిస్థాన్ ఇంటి బాట పట్టాల్సిందే.
READ MORE: Healthy Protein Snacks: శెనగపిండి లేని హెల్తీ ప్రోటీన్ పకోడీ.. ఇలా ‘సింపుల్’గా చేసుకోండి!
Also Read
అయితే.. నేడు స్వల్పంగా వర్షం పడుతుండగా టాస్ ముగిసింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆ తేలికపాటి జల్లులు క్రమంగా భారీ వర్షంగా మారడంతో ఒక్క బంతి కూడా వేయకుండానే అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఈ మ్యాచ్ కోసం పాకిస్థాన్ తమ జట్టులో ఒక మార్పు సైతం చేసింది. ఖవాజా నఫాయ్ స్థానంలో ఫఖర్ జమాన్‌ను తుదిజట్టులోకి తీసుకుంది. న్యూజిలాండ్ మాత్రం మూడు మార్పులతో బరిలోకి దిగింది. కెనడాతో జరిగిన మ్యాచ్‌ను అనారోగ్యం కారణంగా మిస్ చేసిన కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తిరిగి జట్టులో చేరాడు. అతనితో పాటు లాకీ ఫర్గూసన్, ఇష్ సోధీకి కూడా అవకాశం ఇచ్చారు. ఈ మ్యాచ్ రద్దవ్వడంతో పాకిస్థాన్ డీలా పడింది. ఇక ఫిబ్రవరి 24న ఇదే వేదికలో ఇంగ్లాండ్‌తో, ఫిబ్రవరి 25న న్యూజిలాండ్‌ను దాయాది జట్టు ఎదుర్కోనుంది. దాయాది జట్టు ఇంటికి పయనమవుతుందా? రెండు మ్యాచ్‌లు గెలిచి సెమీస్ ఆడుతుందా? అనే అంశంపై అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
తాజావార్తలు
-
AP Assembly: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. 4 రోజుల్లో 12 బిల్లులకు ఆమోదం
-
Cupid Share: కండోమ్ కంపెనీకి కాసుల వర్షం.. రాబడి ఎంతో తెలుసా!
-
Lucknow Crime: భార్యను చంపి.. వాట్సాప్ స్టేటస్‌లో షాకింగ్ మెసేజ్! ఆ తర్వాత గంటల్లోనే మరో దారుణం, చివరికి సూసైడ్..
-
Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
-
Telangana High Court : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై హైకోర్టు ఫైర్.. స్టే ఎత్తివేతకు నిరాకరణ.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!