IPL Player: బిగ్‌షాక్.. మహిళతో శారీరక సంబంధం.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్‌పై పోలీస్ కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగాల్ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్-బ్యాటర్ అభిషేక్ పోరెల్‌పై హుగ్లీ జిల్లాలోని మోగ్రా పోలీస్ స్టేషన్లో ఒక మహిళ ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని, ఆ తర్వాత దాడికి పాల్పడి, బెదిరింపులకు గురిచేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. గతంలో ఇండియా-ఎ జట్టుతో కలిసి యూకే, ఆస్ట్రేలియా పర్యటనలకు వెళ్లిన 23 ఏళ్ల పోరెల్.. ఈ ఆరోపణలన్నింటినీ తీవ్రంగా ఖండించాడు. సదరు మహిళ, ఆమె తల్లి మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఫిర్యాదు వివరాల ప్రకారం.. సదరు మహిళకు, అభిషేక్ పోరెల్‌కు గత మూడేళ్లుగా పరిచయం ఉంది. అయితే, గత ఏడాది నుంచి వారి మధ్య విభేదాలు రావడంతో పోరెల్ ఆమెకు దూరం జరగడం ప్రారంభించాడని తెలుస్తోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడని, తీరా ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఆమె ఆరోపించింది. దీనితో పాటు తనపై శారీరక దాడి, క్రిమినల్ బెదిరింపులకు కూడా పాల్పడ్డాడని పేర్కొంది. దీనిపై పిటిఐ వార్తా సంస్థతో మాట్లాడిన ఒక పోలీసు అధికారి, తమకు ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ధృవీకరించారు.
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ప్రస్తుతం బెంగళూరులో ఉన్న అభిషేక్ పోరెల్ ఈ ఆరోపణలను పూర్తిగా అవాస్తవాలని కొట్టిపారేశాడు. ప్రస్తుతం తాను ఆటలో రాణిస్తున్నందున, ఇలాంటి రకరకాల విషయాలను తెరపైకి తెస్తున్నారని మీడియాకు తెలిపాడు. ఇప్పటివరకు పోలీసులు తనను సంప్రదించలేదని, పోలీసుల ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత తాను ఈ విషయంపై పూర్తి వివరంగా స్పందిస్తానని చెప్పాడు.
ఎడమచేతి వాటం టాప్ ఆర్డర్ బ్యాటర్ అయిన అభిషేక్ పోరెల్, 2023 నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 108 పరుగులు చేశాడు. అలాగే, 2021-22 సీజన్లో బెంగాల్ జట్టు తరఫున ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన పోరెల్, ఇప్పటివరకు 32 ఫస్ట్-క్లాస్, 23 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడాడు.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!