NTV Telugu Site icon

Business News: ఇన్వెస్టర్లపై కాసుల వర్షం.. ఒక్క సెకనులో రూ.3 లక్షల కోట్ల లాభం

Stockmarket

Stockmarket

ఈరోజు దీపావళి ముహూర్తం ట్రేడింగ్ సందర్భంగా స్టాక్ మార్కెట్‌లో అద్భుతమైన ప్రారంభం కనిపించింది. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైంది. ఆ తర్వాత బీఎస్‌ఈ ప్రధాన సూచీ 65,418.98 పాయింట్లకు చేరుకుంది. దీని వల్ల ఇన్వెస్టర్లు రూ. 3 లక్షల కోట్లకు పైగా ఆర్జించారు. అయితే మార్కెట్ ప్రారంభమైన 6 నిమిషాల్లోనే 345.26 పాయింట్ల లాభంతో 65,235.78 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో టాప్ 30 షేర్లు గ్రీన్ మార్క్‌లో ట్రేడవుతున్నాయి. ఇటు.. ఐటీ కంపెనీల్లో మంచి వృద్ధి కనిపిస్తోంది. మరోవైపు, నిఫ్టీ కూడా 100 పాయింట్లకు పైగా పెరుగుదతో 19500 పాయింట్లకు పైగా పెరుగుదలతో ట్రేడవుతోంది.

Team India: రోహిత్, కోహ్లీ బౌలింగ్ చేయాలన్న ఫ్యాన్స్.. కోరిక తీర్చిన విరాట్

స్టాక్ మార్కెట్‌లోని ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ రెండింటిలోనూ మంచి వృద్ధి కనిపిస్తోంది. బాంబే స్టాక్ ఎక్చేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 364 పాయింట్ల లాభంతో 65,268.84 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభంతో 65,418.98 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రధాన సూచీ నిఫ్టీ 113.10 పాయింట్ల లాభంతో 19,538.45 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. కాగా, నేడు నిఫ్టీ 19,547.25 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.

Jagga Reddy Interview: కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరు?.. సీనియర్‌ నేత జగ్గారెడ్డి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కోల్ ఇండియా షేర్లలో దాదాపు 4 శాతం పెరుగుదల కనిపిస్తోంది. యూపీఎల్ షేర్లు ఒకటిన్నర శాతానికి పైగా పెరుగుదలతో ట్రేడవుతున్నాయి. ఒఎన్‌జిసి, ఇన్ఫోసిస్, ఎన్‌టిపిసి షేర్లు ఒక శాతానికి పైగా పెరిగాయి. బీపీసీఎల్, అపోలో హాస్పిటల్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్ఈలో ఇన్ఫోసిస్, విప్రో షేర్లలో మంచి పెరుగుదల కనిపిస్తోంది. రిలయన్స్ షేర్లు రూ.2329 కంటే ఎక్కువగా ట్రేడవుతున్నాయి. టాటా గ్రూపునకు చెందిన టైటాన్, టీసీఎస్, టాటా స్టీల్ షేర్లలో పెరుగుదల ఉంది.

Team India: రోహిత్, కోహ్లీ బౌలింగ్ చేయాలన్న ఫ్యాన్స్.. కోరిక తీర్చిన విరాట్

స్టాక్ మార్కెట్ ఓపెన్ అయిన తీరు వల్ల మార్కెట్ ప్రారంభమైన వెంటనే ఇన్వెస్టర్లు రూ.3 లక్షల కోట్లు ఆర్జించారు. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ.3,20,29,232.24 కోట్లుగా ఉంది. కాగా ఈరోజు మార్కెట్ ప్రారంభమైన వెంటనే మార్కెట్ క్యాప్ రూ.3,23,38,359.97 కోట్లకు చేరుకుంది. అంటే ఒక్క సెకనులో బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ.3,09,127.73 కోట్లు పెరిగింది. ఇది పెట్టుబడిదారుల ఆదాయం.