IND vs ZIM: అంతర్జాతీయ టీ20ల్లో చరిత్ర సృష్టించిన భారత్!
- జింబాబ్వేపై విజయం
- తొలి జట్టుగా భారత్ చరిత్ర
- రెండో జట్టుగా పాకిస్థాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Most Wins in International T20Is: భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో విజయానంతరం ఈ రికార్డు నెలకొల్పింది. ఈ విజయంతో టీ20 ఫార్మాట్‌లో 150 విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా భారత్ చరిత్రకెక్కింది. టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకు 230 మ్యాచ్‌లు ఆడిన భారత్.. 150 మ్యాచ్‌ల్లో గెలుపొంది అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాలు నమోదు చేసిన రెండో జట్టుగా పాకిస్థాన్ ఉంది. పాక్ 245 మ్యాచ్‌ల్లో 142 విజయాలు అందుకుంది. ఈ జాబితాలో న్యూజిలాండ్ 220 మ్యాచ్‌ల్లో 111 విజయాలు, ఆస్ట్రేలియా 195 మ్యాచ్‌ల్లో 105 విజయాలు, దక్షిణాఫ్రికా 185 మ్యాచ్‌లో 104 విజయాలు సాదించి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Also Read
- PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
- BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
- PM Modi - Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
- Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు '+91' ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
మూడో టీ20లో భారత్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. శుభ్‌మన్ గిల్ (66; 49 బంతుల్లో 7×4, 3×6), రుతురాజ్ గైక్వాడ్ (49; 28 బంతుల్లో 4×4, 3×6), యశస్వి జైస్వాల్ (36; 27 బంతుల్లో 4×4, 2×6) రాణించడంతో ముందుగా భారత్ 4 వికెట్లకు 182 పరుగులు సాధించింది. ఛేదనలో జింబాబ్వే 6 వికెట్లకు 159 పరుగులే ఓడింది. మైయర్స్ (65 నాటౌట్, 49 బంతుల్లో 7×4, 1×6) టాప్ స్కోరర్. వాషింగ్టన్ సుందర్ (3/15), అవేష్ ఖాన్ (2/39) జింబాబ్వేను కట్టడి చేశారు.
తాజావార్తలు
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
-
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్‌కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
-
Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!