Site icon NTV Telugu

IND vs ENG: ఇండియా-ఇంగ్లాండ్‌ వార్మప్ మ్యాచ్కు వర్షం అడ్డంకి..

Ind Eng Match

Ind Eng Match

వన్డే ప్రపంచకప్ లో భాగంగా నేడు ఇండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరుగనుంది. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. అక్కడ వర్షం పడుతుంది. ఆ కారణంగా మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ప్రపంచకప్ మ్యాచ్ లకు ముందు ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది.

Read Also: MS Dhoni: మహీ భాయ్ ఐ లవ్ యూ.. అభిమాని పిలుపుకు మిస్టర్ కూల్ ఎలా స్పందించాడంటే..!

టాస్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. మేము ముందుగా బ్యాటింగ్ చేస్తామని.. దానికి ప్రత్యేక కారణం ఏమీ లేదన్నాడు. ఇటీవలే తమ జట్టు మంచి ప్రదర్శన చూపించిందని పేర్కొన్నాడు. తాము ఇప్పుడు అగ్రశ్రేణి జట్లలో ఒకదానితో ఆడుతున్నాం. అందరూ పూర్తిగా ఫిట్‌గా ఉన్నారని రోహిత్ శర్మ తెలిపాడు.

Read Also: Chain snatchers: విశాఖలో 11 చైన్ స్నాచింగ్ కేసులు.. ఛేదించిన పోలీసులు

ఇండియా టీమ్:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహమ్మద్ సిరాజ్.

ఇంగ్లండ్ టీమ్:
డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (wk/c), లియామ్ లివింగ్‌స్టోన్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, సామ్ కర్రాన్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, అట్కిన్సన్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్.

Exit mobile version