Site icon NTV Telugu

IND vs ENG: ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో భారీ వర్షం.. భారత్ ఆశలు అడియాసలయ్యేనా..?

Ind End

Ind End

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లో రెండవ మ్యాచ్ బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరుగుతోంది. నేడు (జూలై 6) ఈ మ్యాచ్‌లో చివరి రోజు. ఈరోజు, ఇంగ్లాండ్ తన రెండవ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 72 పరుగుల వద్ద ఆడుతోంది. ఓల్లీ పోప్ 24 పరుగులు, హ్యారీ బ్రూక్ 15 పరుగులతో నాటౌట్‌గా కొనసాగుతున్నారు. ఈ మ్యాచ్‌లో, భారత జట్టు ఇంగ్లాండ్‌కు 608 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

READ MORE: F-35 Fighter Jet: విడదీస్తారా, రిపేర్ చేస్తారా..? కదిలిన ఎఫ్-35 ఫైటర్ జెట్..

ప్రస్తుతం, ఎడ్జ్‌బాస్టన్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఆట సకాలంలో ప్రారంభం కాలేదు. ఆట ప్రారంభానికి ముందే వర్షం పడటంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్‌రూమ్‌కే పరిమితమయ్యారు. వర్షం కాస్త తగ్గుముఖం పట్టినా.. మైదానంలో చాలా ప్రదేశాల్లో నీటి మడుగులు కనిపిస్తున్నాయి. ఈ పరిణామం మ్యాచ్‌ ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఫలితాన్ని ఎలా నిర్ణయిస్తారు అనే అంశంపై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు.. 72 పరుగుల వద్ద 3 వికెట్లు పడగొట్టిన భారత్ బౌలర్లు త్వరగా ఆలౌట్ చేయాలని ఉత్సాహంతో ఉన్నారు!

READ MORE: Lucky Bhasker : లక్కీ భాస్కర్ కు సీక్వెల్ చేస్తా.. వెంకీ అట్లూరి క్లారిటీ

ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ vs ఇంగ్లాండ్ మ్యాచ్‌ల వివరాలు..
మొత్తం టెస్ట్ మ్యాచ్‌లు: 8
ఇంగ్లాండ్ విజయం: 7
భారత్ విజయం: 0
డ్రా: 1

ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్ రికార్డులు..
మొత్తం టెస్ట్ మ్యాచ్‌లు: 56
విజయం: 30
ఓటమి: 15
డ్రా: 11

Exit mobile version