NTV Telugu Site icon

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. మూడు రోజులు వానలే..

Rain Alert

Rain Alert

Rain Alert to Telugu States: భానుడి ప్రతాపంతో ఉక్కపోతున్న తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ చల్లని వార్త చెప్పింది. మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్లు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిని వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నైరుతి గాలుల ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని, ఏపీలో నేడు, రేపు, ఎల్లుండి అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలో గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణ శాఖ ప్రకటనతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. చేతికొచ్చిన పంట ఎక్కడ నేలరాలిపోతుందోనని ఆందోళన చెందుతున్నారు.

Read Also: KOLORS Shocks: వెయిట్‌ లాస్‌ పేరుతో విద్యుత్ షాకులు.. నిర్లక్ష్యపు థెరపీతో ప్రాణాలకు ముప్పు

రానున్న ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుతాయని వివరించింది. ఇదిలా ఉండగా.. రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు నేడు పెరిగే అవకాశం ఉందని.. రేపటి నుంచి 2 నుంచి 4 సెంటిగ్రేడ్‌ల తగ్గుతుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు భారీ అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భాగ్యనగర వాసులను శుక్రవారం వరుణుడు కనికరించాడు. పలు ప్రాంతాల్లో సాయంత్రం కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం కలిగింది. ఇదిలా ఉండగా.. జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలు రైతులను ముంచేశాయి. ఇప్పటికే రైతులు వరిధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తుండగా.. ఈ వర్షంగా కారణంగా ధాన్యం కుప్పలు తడిచిపోయాయి. చాలా మంది రైతులు ఇంకా వరికోతలు కోయలేదు. దీనివల్ల వారికి ఈ అకాల వర్షం ఆటంకం కలిగించింది.